ఇక రాజమౌళి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్న మరో హీరో జాన్ అబ్రహం. ఈ హీరోకి ప్రాంతీయ భాషలో వచ్చే సినిమాలు చాలా చులకనగా చూస్తాడు. ఆ ఉద్దేశ్యంతోనే ఒప్పుకోలేదేమో..బహుబలి సినిమాలో రానా చేసిన భళ్ళాలదేవ పాత్రకోసం జాన్ ను అడిగాడట రాజమౌళి.
కాని అతను రిజెక్ట్ చేయడంతో రానా సీన్ లోకి వచ్చాడు. ఇక బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదించాడట జక్కన్న. కాని ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సత్యరాజ్ కు ఆ అవకాశం వచ్చింది. ఈసినిమా తరువాత సత్యరాజ్ కు కూడా అవకాశాలు భారీగా పెరిగిపోయాయి.