
Bhanumathi Serial: టీవీ సీరియల్స్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్‌తో, క్రేజీ జోడీలతో తీసిన సీరియల్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. అవి టీవీ షోస్ కంటే, ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా ఆదరణ పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో ఈటీవీ, జెమినీ, జీ తెలుగు, స్టార్ మా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ఉన్నాయి.
ఇందులో దేనికదే ప్రత్యేకం. ఒక్కో టీవీలో ఒక్కో సీరియల్ స్పెషల్‌గా ఉంటుంది. అలాగే స్టార్ మాలో కొన్ని సీరియల్స్ బాగా ఆదరణ పొందాయి. ఇటీవల కాలంలో `కార్తీక దీపం` ఎక్కువగా వినిపించింది. అందులో భాగంగా `సత్యభామ` సీరియల్ కి కూడా మంచి ఆదరణే దక్కింది. కానీ క్రమంగా దాని రేటింగ్ పడిపోతూ వచ్చింది.
దీంతో సడెన్‌గా ఈ సీరియల్‌ని ముగించారు. గత వారంతోనే ఈ సీరియల్ అయిపోయింది. తాజాగా కొత్త సీరియల్ `భానుమతి`ని ప్రసారం అవుతుంది. `సత్యభామ` స్థానంలోనే `భానుమతి`ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సోమవారం నుంచి ఈ సీరియల్ స్టార్ మాలో రాత్రి ఆరు గంటలకు ప్రసారం అవుతుంది.
ప్రారంభం నుంచే అందరి దృష్టి దీనిపై ఉంది. పైగా ప్రోమోలతో ఆద్యంతం ఆకట్టుకుంది. టీవీ లవర్స్ ని ఆకర్షించింది. మరి అంతగా ఆకర్షించేలా ఇందులో ఏముంది? ఇందులో ఏం చూపిస్తున్నారు? ఈ సీరియల్ ని ఎందుకు చూడాలనేది చూస్తే.
`భానుమతి` సీరియల్ గురించి టీమ్ ముందుగానే ఒక నోట్‌ని విడుదల చేసింది. ఇందులో ఈ సీరియల్‌లో ఏం చూపించబోతున్నామో తెలిపింది. సీరియల్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదని, విలక్షణమైన కథతోపాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం, విలువలతో కూడుకున్నది.
ఆ దిశగానే తమ స్టార్ మా అడుగులు వేస్తుందని చెప్పింది టీమ్. తమ ఛానెల్‌లో అందించిన పాత్రల్లో సాహసం, దైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బాధ్యత, నిజాయతీ, కరుణ, దయ వంటి వాటిని చూపిస్తూ వచ్చాం. ఆ కోవలోనే మరో కొత్త పాత్రనే `భానుమతి` అని చెప్పింది.
మనం ఎగరాలని బలంగా అనుకుంటే రెక్కలు వాటంతట అవే వస్తాయని నిరూపించే అమ్మాయి కథే `భానుమతి` సీరియల్ అని తెలిపింది. ఇక సీరియల్ కథ పరంగా చూస్తే, ఇందులో చదువే జీవితానికి వెలుగునిస్తుందని నమ్మే అమ్మాయినే భానుమతి. ఆమె బాగా చదువుకుని డాక్టర్ కావాలనుకుంటుంది.
కానీ తన కలకి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారుతుంటాయి. అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. మరి తన గోల్‌ని రీచ్ కావడం కోసం ఆ అమ్మాయి తనకు ఎదురైన సవాళ్లని ఎలా ఫేస్ చేసింది? వాటిని ఎలా అధిగమించింది? ఎలాంటి ధైర్యసాహసాలు చూపించిందనేది ఈ `భానుమతి` సీరియల్ కథ. దీనికి `మా ఇంటి మాలక్ష్మి` అనేది ట్యాగ్ లైన్.
ఈ సీరియల్‌లో భానుమతి పాత్రలో చైత్ర మెయిన్ లీడ్‌గా నటిస్తుంది. మేల్ లీడ్‌గా శంకర్ చక్రవర్తి నటిస్తున్నాడు. ఈ సీరియల్ తమిళంలో హిట్ అయిన `చిన్నమరుమగల్` అనే సీరియల్ నుంచి రీమేక్ చేస్తున్నారని సమాచారం. అక్కడ ఇది విజయ్ టీవీలో ప్రసారం అయ్యింది.
`భానుమతి` సీరియల్‌లో సాయికిరణ్, శృతి, సహస్ర నాయుడు, అక్షిత ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి ఆరు గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
also read: Shreya Ghoshal Net Worth: శ్రేయా ఘోషల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్