అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి ఆర్య కథ బాగా సెట్ అయింది. ఫలితంగా ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అదే ఏడాది ప్రభాస్ వర్షం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోలు. బాహుబలి 1, బాహుబలి 2, కల్కి 2898 ఎడి లాంటి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది.