డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తే కానీ కెరీర్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తే కానీ కెరీర్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి. ఫ్లాపుల సంగతి పక్కన పెడితే జగన్నాధ్ కథలు, దర్శకత్వంలో మునుపటి జోరు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటి వర్కౌట్ అయింది.
24
Puri Jagannadh
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత పూరి జగన్నాధ్ సందిగ్ధంలో పడ్డారు. ఆయనతో సినిమాల్లోకి చేసేందుకు హీరోలు ముందుకు రావడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ తో పూరి జగన్నాధ్ మరో సారి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ ఆ వ్యవహారం ఇంకా తేలలేదు.
34
సీనియర్ హీరోల వైపు కూడా పూరి జగన్నాధ్ చూపు ఉంది. కానీ సీనియర్ హీరోల్లో ఎవరు ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. చిరంజీవి, బాలయ్య ఇద్దరూ బిజీగా ఉన్నారు. వెంకటేష్ తో పూరి జగన్నాధ్ ఇంతవరకు సినిమా చేయలేదు. నాగార్జున, పూరిది మాత్రం హిట్ కాంబినేషన్.
44
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దగ్గర 4 కథలు ఉన్నట్లు కోన వెంకట్ చెబుతున్నారు. కథలు ఉన్నప్పటికీ హీరోలు దొరకడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వరుస హిట్లు, పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టమే అని ఫ్యాన్స్ అంటున్నారు.