ఆ నిర్మాత ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. ఆయన టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నాడు. అప్పటికే చాలా సినిమాలు నిర్మించి హిట్ కొట్టాడు. తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ `అల్లుడు శీను` సినిమా నిర్మించారు. కొడుకుని గ్రాండ్ గా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో భారీ కాస్టింగ్, టెక్నీషియన్లని తీసుకున్నారు.
కొడుక్కి జోడీగా సమంత హీరోయిన్‌గా నటించగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకుడు. సినిమాని భారీ స్కేల్‌లో రూపొందించారు. రిలీజ్ అయిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. పోయిందని కొందరు అన్నారు. కానీ నిర్మాతగా తాను సేఫ్ అని, తన దృష్టిలో అది హిట్ అయిన సురేష్ తెలిపారు.