దిల్‌ మూవీ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోందో తెలుసా?

First Published | Dec 17, 2024, 9:03 AM IST

Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం లైమ్‌ లైట్‌లో ఉండరనేది బహిరంగ రహస్యమని తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్లు కొద్ది కాలమే ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. అలా హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుని వెండి తెరకు దూరమైన ఓ అందాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

నితిన్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'దిల్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 91 కేంద్రాల్లో 50 రోజులకు పైగా నడిచి రికార్డును సృష్టించింది. ఇక ఈ సినిమా ఎంతో మంది కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

నితిన్‌ను మాస్‌ హీరోగా నిలబెట్టిందీ మూవీ. అలాగే దర్శకుడు వి.వి.వినాయక్‌ను మంచి దర్శకుడిగా నిలబెట్టిందీ మూవీ. ఇక నిర్మాత రాజు ఇంటి పేరును మార్చేసిందీ మూవీ. ఈ సినిమా తర్వాత 'దిల్‌ రాజు'గా మారిపోయారు. వి.వి.వినాయక్‌ మార్క్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోయిజం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇక ఈ సినిమా విజయంలో హీరోయన్‌ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. నితిన్‌కు జంటగా నటించిన నేహా బాంబ్‌ తన అందం, అభినయంతో నందిని పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పేరుకు తొలి సినిమానే అయినా మంచి నటనను కనబరించింది.
 

Tap to resize

ఈ సినిమా తర్వాత నో, దోస్త్‌, అతడే ఒక సైన్యం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ తర్వాత నేహాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేవని చెప్పాలి. బొమ్మరిల్లు మూవీలో సైడ్‌ క్యారెక్టర్‌లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత దుబాయ్‌ శీనులోనూ ఈ చిన్న పాత్రలో నటించింది. ఇక 2013లో వచ్చిన గోల్‌మాల్‌ తర్వాత నేహా మరో చిత్రంలో కనిపించలేదు. టాలీవుడ్‌లో అడుగు పెట్టే ముందు నేహా హిందీలో 'ఇష్క్ హోగయా మేను' సినిమాలో నటించింది. ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో సీరియళ్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 
 

సినిమాలకు దూరంగా ఉన్నా.. కైసే యే ప్యార్‌ హై సీరియల్‌తో బుల్లి తెర ప్రేక్షకులను పలకరించింది. ఇక 'నాగిన్‌ వాడన్‌ కీ అగ్నీ పరీక్ష' సీరియల్‌ తర్వాత నేహా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కాగా 2010లో నేహా వివాహం చేసుకుంది. కృశాంత్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా లీడ్‌ చేస్తోంది. నేహాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తెరకు దూరమైనా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. దీంతో అడపాదడపా దిల్‌ మూవీ హీరోయిన్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదండి ఒకప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన అందాల తార నేహా బాంబ్‌ ప్రస్తుతం ఇలా కుటుంబ జీవితంలో బిజీగా మారిపోయింది. 
 

ఇక అడపాదడపా ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి దూరమైనా నేహా వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అయితే చాలా మంది హీరోయిన్లు వెండి తెరకు దూరమై మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో నేహా కూడా మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తుందోమే అని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.
 

Latest Videos

click me!