త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

Published : Jun 16, 2024, 09:39 AM IST

త్రిష నా పెళ్లి చెడగొట్టింది. నా గురించి ఉన్నవి లేనివి చెప్పింది అంటూ ఆరోపణలు చేస్తున్నాడు సౌత్ స్టార్ హీరో ఒకరు.  ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఆహ్యాడ్సమ్ హీరో ఎవరు...? ఏంటా కథ.   

PREV
18
త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

దాదాపుగా 25 ఏళ్లకు పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ. అంతే కాదు ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో  అత్యంత ధనిక నటీమణులలో త్రిష ఒకరు. సినిమాకు 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న ఈ సీనియర్ నటీమణి.. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది. 
 

28
kollywood actress trisha

2000 లో తన సినిమా జీవితం స్టార్ట్ చేసిన ఈ తమిళ బ్యూటీ..  తమిళం మరియు తెలుగులో వరుస హిట్ సినిమాలను చేసింది.  త్రిషకు సౌత్ ఇండియా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష. ఇక హీరోయిన్ గా ఆమెపని అయిపోయింది అనుకుంటున్న టైమ్ లోనే పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత విజయ్ జోడీగా లియో సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ లియోలో విజయ్ భార్య పాత్రలో త్రిష నటించింది. 

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

38

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో దూసకుపోతున్న త్రిష.. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. అయితే తాను పెళ్ళి చేసకోండా.. ఇతర ఆర్టిస్ట్ ల పెళ్ళిళ్లు చెడగొడుతుందట చెన్నై చిన్నది. తాజాగా ఓహీరో.. తన పెళ్ళిని త్రిష చెడగొట్టిందంటూ సంచలన నిజాలు వెల్లడించాడు ఇంతకీ ఎవరా హీరో.
 

48

తమిళ, తెలుగు సినిమాల్లో సందడి చేసిన హీరో  శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ గుర్తుండే ఉంటుంది. ఈ హీరో  ఓ ఈవెంట్‌లో త్రిష గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు.  త్రిషతో తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటునాని, అదే విధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట. అయితే త్రిష, వందన దగ్గరకు వెళ్లి తన గురించి బ్యాడ్‌గా చెప్పిందట. 

58

శ్రీరామ్ కు  చదువులేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు… ఇలా తన గురించి ఉన్నవి లేనివి చెప్పిందట త్రిష. అయితే ఈ విషయాన్ని తాను ప్రేమించి వందన వచ్చి శ్రీరామ్ తో చెప్పడంతో షాక్ అయ్యాడట. ఇలా ఎందుకు చెప్పావంటూ త్రిషనే అడిగాడట శ్రీరామ్. దాంతో  త్రిష వందన నా ఫ్రెండ్.. నీలాంటి వాడికి ఎలారా ఇచ్చేది తనను అంటు గట్టిగా నవ్విందట. అప్పుడు తనకు అర్ధం అయ్యింది... అది ప్రాంక్ అని. 

68

ఇక త్రిష ఇండస్ట్రీలో చాలా మందికి క్లోజ్. తన తోటి నటీనటులుతో మంచి సాన్నిహిత్యం మేయింటేన్ చేస్తుంటుంది. అలా టాలీవుడ్ హీరో శ్రీరామ్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ను మేయింటేన్ చేస్తుంటుంది. శ్రీరామ్, త్రిష కాంబినేషన్‌లో తొలిసారి ‘మనేసెళ్లమ్’ అనే సినిమా వచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా వళ్ల వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 
 

78

ఇక అలా త్రిష తన పెల్లి చెడగొట్టాలని చూసిందంటూ శ్రీరామ్ వెల్లడించారు.  శ్రీరామ్ 2008లో వందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక హీరోగా ఎంటర్ అయిన శ్రీరామ్.. కొన్నాళ్ళు వరుస సినిమాలు చేశాడు. తరువాత కెరీర్ డౌన్ అవ్వడంతో.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. 

88
Trisha

అటు త్రిష మాత్రం ప్రస్తుతం దూకుడు మీద ఉంది. వరుసగా తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో అజిత్, విజయ్ సినిమాల్లో చేస్తున్న చెన్నై చిన్నది.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories