తెలుగులో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ `ఖుషి`, `తమ్ముడు`, `జల్సా`, `తొలి ప్రేమ`, అలాగే ప్రభాస్ `రెబల్`, మహేష్‌బాబు `ఒక్కడు`, `పోకిరి`, `బిజినెస్ మేన్`తోపాటు ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, రవితేజ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా పది కోట్లు దాటలేదు. `జల్సా` సినిమా ఐదారు కోట్లు వసూలు చేసిందన్నారు. అదే మనవాళ్లు పండగ చేసుకున్నారు. కానీ తమిళంలో విజయ్ `గిల్లి` మూవీ మాత్రం ఏకంగా యాభై కోట్లు వసూలు చేయడం విశేషం. అధికారికంగా ప్రకటించిన లెక్క ఇదైతే, ఒరిజినల్‌గా ఇది ముప్పై ఓట్లు చేసిందని సమాచారం.