మిథున్ చక్రవర్తి తెలుగులో కూడా నటించారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించి గోపాల గోపాల మూవీలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు. ఒక్క అవకాశంతో తనేంటో నిరూపించుకున్న మిథున్.
వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన ఆస్తి దాదాపు 400 కోట్లు ఉంటుందని అంచనా. ఊటీలోని మడ్ ఐలాండ్‌లో మిథున్‌కు ఇల్లు కూడా ఉంది. అనేక హోటళ్లు , కాటేజీల యజమాని కూడా.
ముంబైకి సమీపంలో ఫామ్ హౌస్ ఉన్న మిథున్ చక్రవర్తికి మైసూర్‌లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక రెండు పెళ్ళిళ్ళతో అప్పట్లో వార్తల్లో నిలిచిన మిథున్ కు శ్రీదేవితో అఫైర్ ఉన్నట్టు, వాళ్ళిద్దరు పెళ్ళి కూడా చేసుకున్నట్టు రూమర్స్ ఉన్నాయి.
నిజం ఎంటో ఎవరికి తెలియదు. ఇక మిథున్ చెత్తకుండీలో దొరికిన ఓ పాపను తన బిడ్డలా పెంచి పెద్ద చేశారు. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆయన బిజేపీలో కొనసాగుతున్నారు.