రష్మికా మందన్నా, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన సికందర్ సినిమా ఈద్ పండుగకు విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ ను రష్మికా మందన్నా ఇటీవల షేర్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ జనాలు మరో సూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు వరుస విజయాల్లో ఉన్న రష్మికా మందన్నా కూడా 4వ బ్లాక్ బస్టర్ సినిమా సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతోంది.
ఇక ఆమె కోసం నిర్మాతలు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే 10 కోట్లకు పైగా తీసుకుంటూ వస్తున్న రష్మిక. ఇక నుంచి 20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్ లాంటి దర్శకులు హీరోయిన్లను రిపిట్ చేయరు. కాని సుకుమార్ ఈసారి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. తన నెక్ట్స్ సినిమాలో కూడా శ్రీవల్లినే తీసుకోబోతున్నాడని టాక్.