భార్యతో విభేదాలు, ఇంటిని క్లీన్ చేస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా?

Published : Apr 29, 2025, 12:29 PM IST

అతను ఓ స్టార్ హీరో, ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు,  బ్లాక్ బస్టర్ సినిమాలతో సందడి చేశాడు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ సెలబ్రిటీ చాలా సింపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తారు. సాధారణ జీవితం గడపడం అంటే అతనికి చాలా ఇష్టం.  మరీ ముఖ్యంగా తన పనులు తాను చేసుకుంటూ ఇంటి పనులు కూడా చేస్తున్నాడు హీరో. ఇంతకీ ఎవరతను? 

PREV
15
భార్యతో విభేదాలు, ఇంటిని క్లీన్ చేస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు చాలాస్టైలీష్ గాఉండటానికి ఇష్టపడతారు. ఏపని చేయాలన్నీ అసిస్టెంట్లు, పనివాళ్లు తప్పనిసరి. ముఖ్యంగా సెలబ్రిటీల ఇళ్లల్లో ఇంటి, వంట పని చేసేందుకు సపరేట్ గా పని మనుషులు ఉంటారు. దాదాపు ఇంట్లో పనులన్నీ వారే చేసుకుంటారు. కాస్త స్టార్ డమ్ వస్తే చాలు గోడుకు పట్టుకోడానికి కూడా పనివారిని పెట్టుకునే సెలబ్రిటీలు ఉన్నారు. అటువంటిది ఓ స్టార్ హీరో మాత్రం సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు, తన పనులే కాదు ఇంటిపనులు కూడా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.? 

Also Read: రాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్, అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న

25
tamil actor jayam ravi changed his name to ravi mohan

ఆహీరో ఎవరో కాదు జయంరవి, అలియాస్ రవిమోహన్. తాజాగా రవిమోహన్  తన ఇంటిని తనే  క్లీనింగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  చీపురు తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఉడ్చేసి, తడి బట్ట పెట్టి  ఫ్లోర్‌ తుడిచాడు స్టార్ హీరో.  అంతేకాదు ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఏమాత్రం మోహమాట పడకుండా  సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నాడు రవిమోహన్. అంతే కాదు ఈ వీడియోకు ఓ  ఓ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. . ‘

Also Read: 98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?

35
Jayam Ravi

సండే.. సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అని రాసుకొచ్చాడీ స్టార్ హీరో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక ఓ సెలబ్రిటీ ఇలా వీడియో పెడితే కామెంట్లు రాకుండా ఉంటాయా చెప్పండి.. ఈ క్రేజీ వీడియోకు నెటిజన్లు నుంచి  క్రేజీ కామెంట్స్ చేస్తున్నాయి. 

Also Read: బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?

45
Jayam Ravi

‘మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ సర్.. మీరు గ్రేట్’‌ అని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో నితిన్ నటించిన జయం సినిమా తమిళ్ రీమేక్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు రవి. దాంతో అప్పటి నుంచి అతని పేరు  జయం రవిగా స్థిరపడిపోయింది.  కాని రీసెంట్ గా తనను రవి అని మాత్రమే పిలవాలని రిక్వెస్ట్ చేవాడు రవి. దాంతో అతన్ని రవి మోహన్ అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. 

Also Read: శోభన్ బాబుని చేతగాని హీరో అని తిట్టిన స్టార్ విలన్, కట్ చేస్తే తిండి కూడా లేక హీరోని సాయం అడిగిన నటుడు ఎవరు?

55
Actor Jayam Ravi Divorce

ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే రవి. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్‌ రాజా ఆయన సోదరుడు.  ఇక  రవి మోహన్ ప్రముఖ నిర్మాత సుజాత విజయకుమార్‌ కూతురు ఆర్తిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరవ్‌, అయాన్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రవి- ఆర్తి  మనస్పర్ధలు కారణంగా  గతేడాది విడిపోయారు.  త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు.  

Also Read:ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories