శ్రీలీల ఒడిలో అప్పుడే పుట్టిన పాప, బిడ్డను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ ? ఇంతకీ ఎవరా పాప

Published : Apr 29, 2025, 12:01 PM IST

 స్టార్ హీరోయిన్ శ్రీలీల ఓ కొత్త బిడ్డను పరిచయం చేశారు. ఆ బిడ్డ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పాప ఎవరు? శ్రీలీలకు ఏమౌతుంది? ఏమని పరిచయం చేసింది.? నెటిజన్లు ఏం కామెంట్స్ చేస్తున్నారో తెలుసా? 

PREV
14
శ్రీలీల  ఒడిలో అప్పుడే పుట్టిన పాప,    బిడ్డను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ ? ఇంతకీ ఎవరా పాప

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రీలీల. డాక్టర్ చదువు  పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీలీల, మహేష్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి, దీంతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. 

Also read:  98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?

24
పరాశక్తి హీరోయిన్ శ్రీలీల

నటి శ్రీలీల తమిళంలో పరాశక్తి అనే చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్, రవి మోహన్, అథర్వ వంటి హీరోలతో కలిసి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది శ్రీలీ.  ఈ చిత్రం నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జనవరిలో సంక్రాంతికి విడుదల కానుంది.

Also read:  రాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్, అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న

 

34
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీలీల

అదే సమయంలో, బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ ఓరియెంటెడ్ మూవీలో కూడా శ్రీలీల నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నఈసినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.  అయితే కొన్ని లీగల్ సమస్యల వల్ల  నిర్మాతలు ఈ చిత్రానికి ముందు పెట్టిన ఆషికీ 3 అనే పేరును తొలగించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమకథ ఆధారంగా రూపొందుతోంది.  2025 దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది.

Also read:  బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?

44
శ్రీలీల కొత్త బిడ్డ

ఇటీవల నటి శ్రీలీల తన కుటుంబంలో కొత్త సభ్యురాలిని పరిచయం చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్నారిని కౌగిలించుకుంటున్న రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. "ఇంటికి కొత్త వ్యక్తి. వచ్చింది. మనసులో దోచేస్తోంది అని  శ్రీలీల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అయితే, ఈ చిన్నారి గురించి ఆమె ఎలాంటి అదనపు సమాచారాన్ని వెల్లడించలేదు. శ్రీలీల ఇప్పటికే చాలా మంది అనాథ పిల్లలను, బాలికలను దత్తత తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా ఆమె దత్తత తీసుకున్న బిడ్డ అయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ పాప ఎవరు అని నెటిజన్లు కూడా శ్రీలీలను ప్రశ్నిస్తున్నారు. 

Also read: శోభన్ బాబుని చేతగాని హీరో అని తిట్టిన స్టార్ విలన్, కట్ చేస్తే తిండి కూడా లేక హీరోని సాయం అడిగిన నటుడు ఎవరు?

Also read:ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?

 

Read more Photos on
click me!

Recommended Stories