విజయశాంతిపై మనసు పడ్డ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా? లేడీ సూపర్‌స్టార్ చేసిన పనికి మైండ్ బ్లాక్
Vijayashanti : లేడీ సూపర్ స్టార్ విజయశాంతిపై ఓ స్టార్ డైరెక్టర్ మనసు పడ్డాడట. అయితే ఆ విషయంలో విజయశాంతి చేసిన పని మాత్రం అమేజింగా అని చెప్పాలి.
Vijayashanti : లేడీ సూపర్ స్టార్ విజయశాంతిపై ఓ స్టార్ డైరెక్టర్ మనసు పడ్డాడట. అయితే ఆ విషయంలో విజయశాంతి చేసిన పని మాత్రం అమేజింగా అని చెప్పాలి.
Vijayashanti : సావిత్రి తర్వాత హీరోయిన్ల పాత్రకి వన్నె తెచ్చిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. అప్పట్లో ఆమె లేడీ సూపర్ స్టార్‌గా రాణించారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎదిగిన ఆమె ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. స్టార్ హీరోలకు దీటుగా తన సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. వారికి పోటీ ఇచ్చింది.
హీరోలకు దీటుగా విజయశాంతి నటించిన సినిమాలు అప్పట్లో బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే చిరంజీవి, బాలయ్య, వెంకీ వంటి స్టార్స్ కి ఆమె ఏమాత్రం తక్కువ కాదనిపించుకుంది.
విజయశాంతి ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవిలతో సినిమాలు చేసింది. ఒకటి రెండు అటు ఇటుగా ఇద్దరితోనూ పోటా పోటీగా నటించింది. అప్పట్లో వీరి కాంబినేషన్‌లో సినిమాలకు యమ క్రేజ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు.
ఇదిలా ఉంటే హీరోహీరోయిన్ల కలిసి ఎక్కువ సినిమాలు చేస్తే వారి మధ్య ఎఫైర్ ఉందని, లవ్ లో ఉన్నారనే రూమర్స్ కామన్‌గా వస్తాయి. అప్పట్లో బాలయ్య, విజయశాంతి విషయంలో కూడా వచ్చాయట.
అయితే బాలకృష్ణతోపాటు మరో దర్శకుడి విషయంలోనూ విజయశాంతిపై రూమర్స్ వచ్చాయిట. ఓ దర్శకుడు ఈ లేడీ సూపర్‌స్టార్‌ని బాగా ఇష్టపడ్డాడట. అందుకే సినిమాలు రిపీట్ చేశాడనే కామెంట్స్ వస్తుంటాయి.
అలా విజయశాంతిపై అప్పటి స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు విజయేంద్రప్రసాద్ మనసు పడ్డాడట. అంతేకాదు వరుసగా వీరి కాంబినేషన్‌లో సినిమాలు కూడా వచ్చాయి. అప్పట్లో అటు చిరంజీవి, ఇటు బాలయ్యతో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేశారు రాఘవేంద్రరావు.
దీంతో హీరోయిన్ కూడా విజయశాంతినే తీసుకున్నాడట. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయశాంతి దాదాపు పది సినిమాలు చేసింది. దీంతో మంచి ర్యాపో కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే విజయశాంతిపై రాఘవేంద్రరావు మనసుపడ్డాడని దర్శక నిర్మాత గీతా కృష్ణ తెలిపారు.
మొదట దర్శకుడితోనూ ఎఫైర్ ఉందని, ఆ తర్వాత ఆయన్ని దూరం పెట్టిందని, దర్శకుడితో ఆ రిలేషన్ వద్దనుకున్నట్టుగా గీతా కృష్ణ ట్రూ మీడియా అనే యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విజయశాంతి, రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో `జానకీ రాముడు`, `మంచి దొంగ`, `అగ్ని పర్వతం`, `రుద్రనేత్ర`, `కొండవీటి రాజా`, `యుద్ద భూమి`, `అపూర్వసహోదరులు`,
`సాహస సామ్రాట్`, `పట్టాభిషేకం`, `చాణక్య శపథం` వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో చాలా వరకు కమర్షియల్‌గా విజయం సాధించాయి. రాఘవేంద్రరావుకి విజయశాంతి సెంటిమెంట్ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంది.
read more: ఎన్ని కాపురాలు కూలుస్తావమ్మా.. రోడ్డుపై సూర్యకాంతంని పట్టుకుని చెడా మడా వాయించిన మహిళ
also read: ఇంత రేట్ అంటే నీ పెళ్లాం వదిలేసిపోతుంది, `అలేఖ్య చిట్టి పికిల్స్` పై ప్రియదర్శి మాస్ ట్రోలింగ్