Anchor Pradeep
టాలీవుడ్ లో బుల్లితెరపై యాంకర్లుగా రాణించడం అంత సులువు కాదు. కాంపిటీషన్ చాలా ఉంటుంది. కానీ సుమ మాత్రం యాంకర్ గా దశాబ్దాలుగా టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఫీమేల్ యాంకర్లలో ఝాన్సీ, శ్యామల లాంటి వారు కూడా సుమతో పోటీలో నిలవలేకపోయారు. పురుషుల్లో ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు.
Anchor Pradeep Machiraju
యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. నెమ్మదిగా ప్రదీప్ హీరోగా కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంపై మంచి బజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఇక టాలీవుడ్ లో ప్రదీప్ ప్రయాణం 2 వేల జీతంతో మొదలైందట. ఈ విషయాన్ని ప్రదీప్ తెలిపారు. ఆ తర్వాత యాంకర్ గా మంచి పేరు వచ్చింది. టీవీ షోలతో బిజీ అయ్యాను అని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం మేల్ యాంకర్స్ లో ప్రదీప్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ప్రదీప్ సంపాదన, ఆస్తులు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
2 వేల జీతంతో కెరీర్ మొదలు పెట్టిన యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అదే సినిమా ఈవెంట్ అయితే 3 లక్షల వరకు తీసుకుంటాడు. సుమ అత్యధికంగా సినిమా ఈవెంట్ కి 5 లక్షలు తీసుకుంటుంది. ఆమె తర్వాతి స్థానంలో ప్రదీప్ ఉన్నారు. రెమ్యునరేషన్ విషయంలో బుల్లితెరపై అనసూయ, యాంకర్ రవి లాంటి వారిని ప్రదీప్ ఓవర్ టేక్ చేసేశాడు.
Anasuya Bharadwaj
ప్రదీప్ కి బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. అతడి ఆస్తి 15 కోట్లపైనే ఉంటుందని అంచనా. సినిమాల్లో ఆరంభంలో ప్రదీప్ కనీసం డైలాగులు కూడా లేని సైడ్ క్యారెక్టర్లు వేసేవాడు. ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపిస్తే గొప్ప. అలాంటిది ఇప్పుడు హీరోగా కూడా రాణిస్తున్నాడు. ప్రదీప్ కి యువతలో మంచి క్రేజ్ ఉంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం హిట్ అయితే ప్రదీప్ మీడియం రేంజ్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రదీప్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. తన స్నేహితులే ఈ చిత్రం నిర్మించడంతో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.లాభాలు వస్తే వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటా అని ప్రదీప్ తెలిపారు.