ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు రకరకాల పేర్లు వినిపించాయి. టెంపర్ వంశీ, కృష్ణుడు, త్రిగుణ్, రామ్ ప్రసాద్, నరేష్, దేబ్జానీ, చైత్ర, వర్షిణి సౌందరాజన్ రాబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ గా ఇందులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఇద్దరు కామన్‌గా ఉన్నారు. కానీ ఊహించని విధంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. బుల్లితెర భామలు, కమెడియన్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. గ్లామర్ డోస్, కామెడీ డోస్ పెంచబోతున్నట్టు సమాచారం.