నాని హీరోగా నటిస్తోన్న ప్యారడైజ్ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. యేష నాగుల అంటూ సాగే తెలంగాణ ఫోక్ సాంగ్ దుమ్ములేపుతోంది. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే.
ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. సినిమా పాటలకంటే ఫోక్ సాంగ్సే బాగా ఆదరణ పొందుతున్నాయి. యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. దీంతో సినిమాల్లోనూ ఫోక్ సాంగ్స్ ని పెడుతున్నారు మేకర్స్. తెలంగాణ నేపథ్యం, యాస విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ పాటలను కూడా సినిమాల్లో జోడిస్తున్నారు. అందులో భాగంగా ప్యారడైజ్ మూవీలో కూడా తెలంగాణ ఫోక్ సాంగ్‌ని పెట్టారు. `యెష నాగుల` అనే తెలంగాణ జానపద పాటని తాజాగా శనివారం విడుదల చేశారు. మొదట డల్లాల్‌లో కాన్సర్ట్ నిర్వహించి పాటని ఆలపించారు. అనంతరం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
24
నాని, కీర్తిసురేష్ స్టెప్పులతో ఊపేస్తున్న యేష నాగుల పాట
ఈ పాటలో కీర్తిసురేష్ డాన్సులు చేయడం విశేషం. నాని, కీర్తిసురేష్ వేసే డాన్సు ఊపేస్తుంది. ఓ వైపు మాస్ ఫోక్ సాంగ్‌కి, నాని, కీర్తిసురేష్ ఊరమాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పాట మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. లైవ్లీగా, క్యాచీగా సాగుతూ పక్కా జానపద నేటివిటీని ప్రజెంట్ చేశాయి. జంగి రెడ్డి వోకల్స్ పాటకు అథెంటిక్ రస్టిక్ టచ్‌ను అందించగా, ప్రభా తన వోకల్స్ పాటలోని ఎనర్జీని మరింత పెంచారు. ఆట సందీప్ రిథమ్‌కు అనుగుణంగా ఫోక్ మూమెంట్స్, మాస్ డ్యాన్స్ స్టెప్స్‌ను మేళవిస్తూ కొరియోగ్రఫీ అందించారు. పాటను కలర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేయడంతో మ్యూజిక్‌తో పాటు విజువల్‌గానూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు.
34
నాని ఊరమాస్ లుక్
ఈ పాటలో ప్రధానంగా ఆకట్టుకునేది తెలిసిన జానపద బాణీకి కొత్తదనాన్ని జోడించిన విధానం. ఇప్పటికే పాపులర్ అయిన ఫోక్ నంబర్‌కు అనిరుధ్ మరింత గ్రాండ్, సినిమాటిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఎనర్జిటిక్ పర్కషన్, వైబ్రెంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, రిథమిక్ లేయర్స్‌తో పాటకు పవర్‌ఫుల్ కాంటెంపరరీ ఫీల్ తీసుకొచ్చారు. అదే సమయంలో పాటలోని నేటివ్ ఫ్లేవర్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఈ పాటలో నాని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పూర్తి ఎనర్జీతో నాని చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నాని డ్యాన్స్‌లో ఎనర్జీ, స్టైల్, యాటిట్యూడ్ కనిపిస్తాయి. రిథమ్‌కు తగ్గట్టుగా నాని వేసిన మాస్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు కావాల్సిన స్టార్ పవర్‌ను అందించారు.
కీర్తి సురేష్ నాని ఎనర్జీకి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్‌గా నిలుస్తూ విజువల్స్‌కు మరింత చార్మ్‌ను జోడించారు. వీరిద్దరి కాంబినేషన్ డ్యాన్స్ పోర్షన్స్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. రేపు థియేటర్లో ఆడియెన్స్ ఈ పాటకి ఊగిపోతారని చెప్పొచ్చు. ఇప్పటికే `ఆయే షేర్` పాట దుమ్ములేపింది. అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. తాజాగా విడుదలైన పాట దాన్ని బీట్ చేస్తుందా అనేది చూడాలి. ఇక నాని, కయాదు లోహర్ జంటగా నటించగా, మోహన్‌బాబు నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది.