Shiva shankar Master: దారుణం... స్టార్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కి ఈ పరిస్థితా!

Published : Nov 25, 2021, 11:53 AM IST

స్టార్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ (Shiva shankar) వెంటిలేటర్ పై కోవిడ్ తో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో కుటుంబం ఉండడం అత్యంత బాధాకరం.   

PREV
18
Shiva shankar Master: దారుణం... స్టార్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కి ఈ పరిస్థితా!


పది భాషల్లో వెయ్యి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన శివ శంకర్ మాస్టర్ ఆర్థికంగా ఇంత దయనీయ స్థితిలో ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు. 1975లో శివ శంకర్ మాస్టర్ ప్రస్థానం మొదలు కాగా.. మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నాడు. 
 

28

మగధీర చిత్రంలోని 'ధీర ధీర..' సాంగ్ ని శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు జాతీయ అవార్డు దక్కింది. కెరీర్ లో మొదటిసారి మగధీర సినిమాకు జాతీయ అవార్డు గెలుపొందాడు శివ శంకర్ మాస్టర్. ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ పని చేశారు. 
 

38

నటుడిగా కూడా తెలుగు, తమిళ బాషలలో నటించారు. ముప్పైకి పైగా సినిమాలలో శివ శంకర్ మాస్టర్ నటించడం విశేషం. తెలుగులో సుడిగాడు, నేనే రాజు నేనే మంత్రి, రాజుగారి గది 3, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో నటించారు. 

48


బుల్లితెరపై శివశంకర్ మాస్టర్ తనదైన ముద్ర వేయడం జరిగింది. అనేక డాన్స్ రియాలిటీ షోలకు శివ శంకర్ జడ్జిగా ఉన్నారు. అలాగే సీరియల్ నటుడిగా కూడా ఆయన నటించారు. తెలుగులో నాగ భైరవి, నంబర్ వన్ కోడలు, తమిళంలో జ్యోతి సీరియల్స్ లో ఆయన నటించి మెప్పించారు. 
 

58


తమిళనాడులో జన్మించిన శివ శంకర్ మాస్టర్ తండ్రి వోల్ సేల్ పండ్ల వ్యాపారి. చిన్న తనంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న శివశంకర్ మాస్టర్ స్కూల్ కి వెళ్ళలేదు. ఆయన చదువు ఇంటిలోనే సాగింది. అనంతరం హిందూ థియోలాజికల్ సెకండరీ స్కూల్ నందు అభ్యసించారు. 
 

68


కొరియాగ్రాఫర్ గా అనేక మరపురాని విజయాలు అందుకున్న శివ శంకర్ మాస్టర్ గుచ్చిబౌలిలోని ఏజిఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరొక విషాదం ఏమిటంటే ఆయన కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా కరోనా (Corona) బారిన పడ్డారు.

78

 
దీనితో వైద్య ఖర్చుల అవసరమైన ఆర్ధిక సహాయం కోసం పరిశ్రమ వైపు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు నంబర్ ఇచ్చారు. టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఆయనను పట్టించుకోక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
 

88


అదే సమయంలో సోనూ సూద్ (Sonu sood) రంగంలోకి దిగారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు, వైద్య ఖర్చులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడో ఉన్న సోనూ సూద్ కి తెలిసే వరకు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఇంత పెద్ద సెలబ్రిటీ గురించి తెలియకపోవడం శోచనీయం. 

Also read Shiva Shankar master:షాకింగ్.. శివశంకర్ మాస్టర్ పరిస్థితి విషమం, వెంటిలేటర్ పై చికిత్స

Also read Kamal haasan: కమల్ కి రజినీ ఫోన్...!

click me!

Recommended Stories