Rajamouli: రాఘవేంద్రరావు సినిమాల్లో రాజమౌళికి పిచ్చి పిచ్చిగా నచ్చిన మూవీ ఏదో తెలుసా? ఎందుకంత ఇష్టం

Published : Oct 30, 2026, 07:53 AM IST

Rajamouli: టాలీవుడ్ కు అద్భుతమైన సినిమాలతో పాటు.. స్టార్ డైరెక్టర్లను అందించిన ఘనత కె. రాఘవేంద్రరావుకే దక్కుతుంది. రాజమౌళి లాంటి ప్రపంచ స్థాయి డైరెక్టర్లు ఆయన స్కూల్ నుంచి వచ్చినవారే. దర్శకేంద్రుడి సినిమాలలో దర్శకధీరుడికి బాగా నచ్చిన సినిమా ఏది?

PREV
14
దర్శకేంద్రుడి దగ్గర పనిచేసిన దర్శకధీరుడు..

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆయన దర్శకత్వం, టేకింగ్ స్టైల్, ఎంతో మంది కొత్త దర్శకులకు ఆదర్శం. రాఘవేంద్రరావు దగ్గర ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు అసిస్టెంట్స్ గా పనిచేశారు. అందులో ప్రపంచం మెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నారు రాజమౌళి. మరి రాఘవేంద్రరావు చేసిన సినిమాల్లో జక్కన్న కు పిచ్చి పిచ్చిగా నచ్చిన సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా అంటే ఎందుకు అంత ఇష్టం.

24
రాఘవేంద్రరావు సినిమాలో రాజమౌళికి ఇష్టమైనది..

గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళికి రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాల్లో బొబ్బిలి బ్రహ్మన్న మూవీ అంటే ఎంతో ఇష్టమని చెపుతుంటారు. ఈ సినిమా అంటే ఎందుకు అంత ఇష్టమో కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ మూవీ మేకింగ్ జక్కన్నకు బాగా నచ్చుతుందట. రాజమౌళి ఈ సినిమాను తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారిన తర్వాతే చూశారట. అందులోని ప్రతి సన్నివేశం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా నటుడు చలపతి రావు గ్రామంలోకి ప్రవేశించే సన్నివేశాన్ని క్రేన్ షాట్ ద్వారా చిత్రీకరించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఒక్క సీన్‌తోనే ఆ ఊరిలో పోలీసు వ్యవస్థ అవసరం లేకుండా ధర్మాధికారి స్థానానికి ఉన్న ప్రాముఖ్యతను, అక్కడ నెలకొన్న ధర్మపీఠం గొప్పతనాన్ని దర్శకేంద్రుడు ఆవిష్కరించిన విధానం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని రజమౌళి అన్నట్టు తెలుస్తోంది.

34
రాఘవేంద్రరావు క్రియేట్ చేసిన సరికొత్త ట్రెండ్స్‌

సినిమా రంగంలో రాఘవేంద్రరావు నెలకొల్పిన సరికొత్త ట్రెండ్స్‌లో విలన్లతో హాస్యం పండించడం ఒకటి. సాధారణంగా విలన్ పాత్రలు గంభీరంగా ఉంటాయని, కానీ వారితో కూడా కామెడీ చేయించడం అప్పట్లో ఒక కొత్త ప్రయోగమే. అలాంటి ప్రయోగాలు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి, అది ఒక్క రాఘవేంద్రరావుకే సాధ్యమయ్యింది. ఈ ట్రెండ్ ఇప్పటికీ టాలీవుడ్ లో కంటీన్యూ అవుతోంది. కానీ తాను మాత్రం విలన్ పాత్రలతో కామెడీ చేయించలేనని రాజమౌళి సరదాగా ఒప్పుకున్నారు.

44
బొబ్బిలి బ్రహ్మన్న సినిమా రివ్యూ..

బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటన అద్భుతం.. ముఖ్యంగా మీసాలపై వచ్చే డైలాగ్స్, వాటిని ఆయన చెప్పిన తీరు ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. రైలు పట్టాలపై బండిని నిలిపే సీన్, చేతిలో నుంచి రక్తం కారుతున్న డ్రామా వంటి సాంకేతిక షాట్ల వెనుక ఉన్న లోతైన అర్థం తనకు పదేళ్ల తర్వాతే స్పష్టంగా అర్థమైందని రాజమౌళి అన్నారు.

ఈ సినిమాలో హీరోకు కుటుంబ బాధ్యతల వల్ల కలిగే బాధలు, అన్నదమ్ముల మధ్య అనుబంధం, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అద్భుతం. మరీ ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ ఈ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లాయి.. ఈ సినిమా విజయానికి ప్రధాన బలం వారి డైలాగ్స్ కూడా. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఒక మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. ఈ జనరేషన్ కూడా చూడదగ్గ సినిమా. అందుకే ఈమూవీ రాజమౌళిని బాగా ఆకర్శించింది.

Read more Photos on
click me!

Recommended Stories