దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ బాబు 'వారణాసి' గురించి రోజుకో అప్‌డేట్ వస్తోంది. తాజాగా, ఈ సినిమాలోని ఒకే ఒక్క సీన్ కోసం ఏకంగా 3500 మంది ఆర్టిస్టులను తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇండియన్ సినిమాలో భారీ కథలను తెరకెక్కించడంలో 'బాహుబలి' ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఆ సినిమాతో రాజమౌళి, తెలుగు సినిమాను ఒక్కసారిగా పాన్-ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లారు. 'బాహుబలి 2' తర్వాత వచ్చిన 'RRR'తో అయితే విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాదు టాలీవుడ్ కు మొదటి సారి ఆస్కార్ ను తీసుకొచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇక ప్రస్తుతం అంతకు మించిన రికార్డు కోసం రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఆయన తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు.
25
మహేష్ బాబు కోసం జక్కన్న భారీ ప్లాన్..
మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వారణాసి మూవీ తెరకెక్కుతోంది. పాన్ వరల్డ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ ఓ రేంజ్ లో మారబోతోది. వారణాసి నుంచి ఎపుడెప్పుడు అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ న్యూస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి వేసిన ప్లాన్ గురించి తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే?
35
3500 మంది ఆర్టిస్ట్ లతో భారీ సన్నివేశం..?
రాజమౌళి అంటేనే భారీ సెట్లు, యుద్ద సన్నివేశాలకు పెట్టింది పేరు. 'బాహుబలి'లోని వార్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. కానీ, 'వారణాసి'లో అంతకుమించి, కొన్ని రెట్లు పెద్దగా, అద్భుతంగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.రిపోర్టుల ప్రకారం, ఈ సినిమాలోని ఒక యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి ఏకంగా 3500 మంది జూనియర్ ఆర్టిస్టులను వాడుతున్నారట. దీనికోసం గత కొన్ని వారాలుగా టీమ్ ప్రిపరేషన్స్ కూడా చేస్తోందట. అయితే, సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూసేది ఇంతకంటే చాలా పెద్ద సీన్. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సహాయంతో ఈ 3500 మందిని ఏకంగా 50,000 మంది సైనికులుగా చూపించబోతున్నారని సమాచారం.
ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ సన్నివేశాల్లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. 'వారణాసి' ఒక మిథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని టాక్. ఇందులో హీరో వేర్వేరు కాలాల్లో ప్రయాణించే కథాంశం ఉంటుందట. ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పాత్రలో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ ను ఎలా చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో రోజు రోజుకు పెరిగిపోతోంది.
55
8 ఏళ్ల తర్వాత హీరోయిన్ రీ ఎంట్రీ
దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ 'కుంభ' అనే క్యారెక్టర్ చేస్తుండగా, ఇది ఆయన కెరీర్‌లోనే దక్కిన అతిపెద్ద అవకాశం అని చెప్పొచ్చు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాల్ నటిస్తోన్న ఇతర నటీనటులు గురించి ఇంత వరకూ ప్రకటించలేదు. రాజమౌళి ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నాడో.. సినిమా ఎలా ఉండబోతోందో.. చూడాలంటే నెక్ట్స్ ఇయర్ వరకూ ఆగాల్సిందే.