రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?

Published : Feb 17, 2026, 10:14 AM IST

దేశం మెచ్చిన దర్శకుడు రాజమౌళి.. టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన జక్కన్న.. ఇంట్లో ఎవరి మాట వింటాడో తెలుసా? జక్కన్న ఫ్యామిలీలో పెత్తనం అంతా ఎవరిది? స్టార్ డైరెక్టర్ స్వయంగా చెప్పిన విషయం. 

PREV
15
అపజయం లేని దర్శకుడు

కెరీర్ లో ఫెయిల్యూర్ అంటూ ఎరుగని దర్శకుడు రాజమౌళి. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు.. టాలీవుడ్ కే పరిమితం అయిన మన హీరోలను పాన్ ఇండియా స్టార్స్ గా మార్చిన ఘనత జక్కన్నదే. ఆయన సినిమాలతో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల ఇమేజ్ మారిపోయింది. వారి స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ ని బాహుబలితో, రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మార్చాడు. అంతర్జాతీయంగా మన హీరోలకు గుర్తింపు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.

25
జక్కన్న కుటుంబ కథా చిత్రం..

రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడంటే.. ఆయన టీమ్ లో సంగం వారి ఫ్యామిలీనే ఉంటుంది. అందరు పర్ఫెక్ట్ గా వారి పని చేసుకుంటారు. ఫ్యామిలీ అంతా కష్టపడి పనిచేస్తారు.. ఎవరి డ్యూటీలో వారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. రాజమౌళి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు, కీరవాణి అంద్భుతమైన మ్యూజిక్ ఇస్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ కు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. గ్రామీ అవార్డ్ తో పాటు.. ఆస్కార్ కూడా వరించింది. 

ఇక రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్స్ ఆయన భార్య రమరాజమౌళి చూసుకుంటారు. కీరవాణి భార్య వల్లి.. ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేస్తారు. రాజమౌళి కొడుకు, కీరవాణి తనయులు ఇద్దరు కూడా సినిమాకు సబంధించిన ఏదో ఒక బాధ్యతలు తీసుకుంటారు.

35
పని విషయంలో మాత్రం తగ్గేదే లే..

రాజమౌళి కుటుంబం వెకేషన్ కు వెళ్తే.. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తారు.. ఉమ్మడి కుటుంబంగానే అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక పని విషయానికి వస్తే.. రాజమౌళి ఎంత బాధ్యతగా ఉంటారో.. మిగిలిన అందరు అలాగే పనిచేస్తారు. ఎక్కడా తేడా రానివ్వకుండా.. మాట రాకుండా చూసుకుంటారు.

 ఈ విషయంలో జక్కన్న, కీరవాణితో పాటు.. వారి భార్యలు రమా రాజమౌళి, వల్లి కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు. ఒక్కొసారి ఇంట్లో ఆడవాళ్ళే.. పని విషయంలో రాజమౌళి కి, కీరవాణి కి చీవాట్లు కూడా పెడుతుంటారట. ఇక ఇంట్లో పెత్తనం కూడా వారి చేతుల్లోనే ఉంటుందని రాజమౌళి ఓ సందర్భంలో వెల్లడించారు.

45
రాజమౌళి ఇంట్లో పెత్తనం ఎవరిది? ఎందుకు?

రాజమౌళి గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంట్లో పెత్తనం అంతా ఆడవాళ్లదే అని ఒప్పుకున్నారు. ఈ ఈవెంట్ లో ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి ఈ విషయం చెప్పారు. మీరు ఇంత పెద్ద దర్శకులు కదా.. అంత గొప్ప విజయాలు సాధించినా సరే.. ఇంత సింపుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అని జక్కన్నకు ప్రశ్న ఎదురయ్యింది. 

దానికి రాజమౌళి మాట్లాడుతూ..'' మేము ఇంత సింపుల్ గా ఉండటానికి కారణం ఇంట్లో ఆడవాళ్లు.. మేం ఇలా లేకపోతే వాళ్లు మా తాట తీసేస్తారు. గొప్పలకుపోవడం.. లాంటివి వారికి ఇష్టం ఉండదు. సింపుల్ గా ఉండటమే వారికి ఇష్టం. మా ఇంట్లో పెత్తనం అంతా ఆడవాళ్లదే.. వాళ్లు చెప్పినట్టే మేం వింటా.'' అని రాజమౌళి అన్నారు. 

55
సింపుల్ గా ఉండటమే ఇష్టం..

వందల కోట్లు సంపాదిస్తున్నా.. జక్కన్న కుటుంబం అంతా చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. గొప్పలకు పోయి ఖర్చులు చేయడం వారికి ఇష్టం ఉండదు. కుటుంబం అంతా చాలా కష్టపడి.. ఈ స్థాయిలోకి చేరుకోవడంతో.. ఆ విలువ రాజమౌళి కుటుంబానికి తెలుసు. కెరీర్ బిగినింగ్ లో వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారన్న విషయాలను కూడా రాజమౌళి ఓ కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories