Illu Illalu Pillalu Today Episode Feb 17: సాగర్‌ జాబ్ గురించి భాగ్యానికి దొరికిన పెద్ద క్లూ, విశ్వకు బుద్ధి చెప్పిన అమూల్య

Published : Feb 17, 2026, 09:19 AM IST

Illu Illalu Pillalu Today Episode Feb 17: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో భాగ్యానికి సాగర్ ఉద్యోగం విషయంలో ప్రధానమైన క్లూ దొరుకుతుంది. దీంతో నర్మద పని పట్టేందుకు సిద్ధమవుతుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
ప్రేమను నిరాశపరిచిన ధీరజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో ప్రేమకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు తీసుకువస్తాడు ధీరజ్. తన మనసులోని మాటను ఆమెకు చెప్పేందుకు చాలా ప్లాన్ చేస్తాడు. పంచభూతాల సాక్షిగా ఒక మాట చెబుతానని ప్రేమతో అంటాడు. అదేంటో చెప్పమని ప్రేమ అడుగుతుంది. కానీ ధీరజ్ చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. ధీరజ్ మాట్లాడుతూ ఆ మాటలు చెప్పడానికి తేలికగా ఉంటాయి, కానీ మోయడానికి బరువుగా ఉంటాయి.. అవి బయటికి చెప్పేస్తే ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది.. అందుకే చెప్పేస్తున్నా అని అంటాడు. ధీరజ్ అక్కడ ఉన్న ఎర్ర గులాబీని తీసుకొని ప్రేమకు ఐ లవ్ యు అని చెప్పబోతాడు. ఈ లోపు మరోపక్క నుంచి ‘అమూల్య, ఆగు అమూల్య’ అన్న వాయిస్ వినిపిస్తుంది. దీంతో మనసులో మాట చెప్పకుండా అటు తిరుగుతాడు. ఒక పాపను పిలుస్తూ ఒక తల్లి కనిపిస్తుంది. 

వెంటనే ఆ పాపను పట్టుకొని తన చెల్లి అమూల్యను గుర్తు చేసుకుంటాడు ధీరజ్. జాగ్రత్తమ్మా, పడిపోతే చాలా దెబ్బ తింటావు అని అంటాడు. ఇంతలో ఆ పాప తల్లి అక్కడికి వస్తుంది. జాగ్రత్తమ్మా.. మనం ఎంత చేయి పట్టుకున్నా కూడా ఒక్కోసారి చేయి జారిపోతారు. ఎదురు దెబ్బ తగిలితే బాధపడిన తిరిగిరారు కదా.. అని బాధతో చెబుతాడు. అక్కడి నుంచి ఆ తల్లి పిల్లలు వెళ్ళిపోతారు. ప్రేమకు ఇవ్వాల్సిన ఎర్ర గులాబీని ఆ పాపకు ఇచ్చేస్తాడు. ఇక తన మూడ్ మారిపోవడంతో ప్రేమకు తన మనసులో మాట చెప్పడు. ఇద్దరూ ఇంటికి వెళ్లేందుకు బయటికి వచ్చేస్తారు.

ధీరజ్ అమూల్యనే తలుచుకుని చాలా బాధపడతాడు. అమూల్య అని పేరు వినపడగానే నాకు నా చెల్లెలు అమూల్య కనబడింది అంటూ బాధపడతాడు. ఈలోపు ప్రేమ అమూల్య పేరు వింటేనే ధీరజ్ ఇలా అయిపోతున్నాడు.. ఇక అమూల్య మెడలో తాళి కట్టుకోమని చెప్పింది నేనేనని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ ఉంటుంది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరుతారు. కారులో ప్రేమ తన మనసులోనే... అమూల్య విషయం తెలిస్తే ఎక్కడ తనను వదిలేస్తాడో అన్న భయంతో ఆలోచిస్తూ ఉంటుంది.. నా లైఫ్ ఏమవుతుందో ఏమో అనుకొని ప్రేమ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది.

24
సాగర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి

ఇక్కడ నుంచి సాగర్ దగ్గరికి మారుతుంది. సాగర్ రోడ్డుమీద గవర్నమెంట్ ఇచ్చిన పని చేస్తూ ఉంటాడు. సాగర్ కు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి అక్కడికి వస్తాడు. ‘నువ్వు చాలా అదృష్టవంతుడివి.. మీ మామయ్య ఎంతో మందిని కాదని ఈ ఉద్యోగం నీకు వచ్చేలా చేసాడు. అది కూడా జస్ట్ పాతిక లక్షలకే’ అని అంటాడు. 

అదే సమయానికి శ్రీవల్లి భాగ్యం కూరగాయలు కొనుక్కొని ఆ దారిలోనే వస్తూ ఉంటారు. శ్రీవల్లి మాట్లాడుతూ రైస్ మిల్లు తాళాలు కాదు ఇంటి తాళాలు నా చేతికి వచ్చేలా చూడు అని చెబుతుంది. దానికి భాగ్యం ‘ప్రస్తుతం రైస్ మిల్లు తాళాలు చేతికొచ్చాయి కదా, ఇంటి తాళాలు చేతికి రావాలంటే ఆ నర్మద పని పట్టాలి’ అని అంటుంది. శ్రీవల్లి మాత్రం నర్మద పేరు చెబితేనే నాకు భయమేస్తోందని చెబుతుంది. భాగ్యం మాట్లాడుతూ ‘ఆ సాగర్ ఉద్యోగ విషయంలో ఏదో జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదు. మన దగ్గర మీ మామయ్య వాళ్ళ దగ్గర ఏదో దాస్తున్నారు. ఒక్కసారి దాని జుట్టు నా చేతికి చిక్కితే అప్పుడు ఉంటుంది’ అని అంటుంది భాగ్యం.

రోడ్డు మీద సాగర్ ఆ జాబ్ ఇచ్చిన వ్యక్తితో మాట్లాడడం చూస్తారు వీరిద్దరూ చూస్తారు. జాబ్ ఇచ్చిన వ్యక్తి పదివేల రూపాయలు ఇమ్మని అడుగుతాడు. సాగర్ తన దగ్గర డబ్బు లేదని చాలా బతిమిలాడతాడు. సాగర్ జేబులోంచి డబ్బులు తీసుకుంటాడు ఆ వ్యక్తి. ఇదంతా భాగ్యం, వల్లి చూస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని వీడియో తీస్తుంది భాగ్యం. మనం వీడిని పట్టుకుంటే ఆ నర్మద పని పట్టొచ్చు అంటుంది భాగ్యం.

34
ప్రేమ పరీక్ష గోవిందా

ఇక ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మాట్లాడుతుంది. పరీక్ష హాల్లో కూర్చుని ప్రేమ ఆనందంగా ఎగ్జామ్ రాయడం మొదలు పెడుతుంది. కానీ మధ్యలో ధీరజ్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. దాంతో ఆమె అప్ సెట్ అవుతుంది. బయట ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ పరీక్ష ఇరగదీస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఎగ్జామ్ సరిగా రాయలేదని చెబితే ధీరజ్ బాధపడతాడు.. అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక గదిలోంచి బయటికి వస్తుంది ప్రేమ. ఒక వ్యక్తి ప్రేమను పలకరించి ఏంటి ఏదో టెన్షన్ లో ఉన్నారు? ఎగ్జామ్ సరిగా రాయలేదా? అని అంటాడు. దానికి ప్రేమ బానే రాశాను అని చెబుతుంది. మీ పేరు, ఊరు ఏంటి? అని అడుగుతూ ఉంటాడు. దాంతో ధీరజ్ అక్కడికి వచ్చి నీకెందుకురా అని కోప్పడతాడు. ధీరజ్, ప్రేమ విషయంలో జెలస్ ఫీల్ అవుతున్నాడని అర్థమవుతుంది.

44
విశ్వకు బుద్ధి చెప్పిన అమూల్య

ఇక్కడ నుంచి సీన్ సేనాపతి ఇంటికి మారుతుంది. అమూల్య టిఫిన్ తింటూ ఉంటే విశ్వక్ చూస్తాడు. తన మనసులో ‘ఇది ఇంట్లో పనిమనిషిగా ఉండాలి అనుకుంటే దర్జాగా మహారాణిలా కూర్చొని మూడు పూటలా మెక్కుతోంది’ అని అనుకుంటాడు. అక్కడికి భద్రావతి కూడా వస్తుంది. భద్రావతి, విశ్వక్ ను కూడా బయటికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు విశ్వక్ టీ తాగి వెళ్దాము, ఐదు నిమిషాలు ఆగమని చెబుతాడు. 

‘ఈ అమూల్యను పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టింది ఎందుకు? లేగదూడను మేపినట్టు మేపడానికా? అది ఇంటి పనిమనిషి. టీ పెట్టిస్తే తాగి వెళదాం’ అని చెబుతాడు. తనతో ముగ్గురూ వెళ్లి హాల్ సోఫాలో కూర్చుంటారు. విశ్వక్ అమూల్యను ‘ఏయ్ పనిమనిషి వెళ్లి మాకు టీ తీసుకురా పో’ అని అంటాడు. వెంటనే అమూల్య లేచి విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు రేవతి వచ్చి దానికి ఏం వచ్చురా? నేను పెడతాను లే అంటుంది. దీంతో సేనాపతి వాడి పెళ్ళానికి వాడు పని చెబుతున్నాడు.. మధ్యలో నీ పెత్తనం ఏంటి అని తన భార్య పైనే అరుస్తాడు.

అమూల్య కోపంగా కిచెన్ లోకి వెళుతుంది. ముగ్గురికి టీ పెట్టి తీసుకెళ్లి ఇస్తుంది. ఆ సమయంలో విశ్వక్ ‘మన ఇంటి పనిమనిషి రామరాజు కూతురు వచ్చింది. టీ తెచ్చి పెట్టింది. తాగండి’ అని అంటాడు. అమూల్య ముగ్గురికి టీ అందిస్తుంది. విశ్వక్ దగ్గరికి వెళ్లి ‘ఏమండీ మీకోసం స్పెషల్ టీ పెట్టాను తాగండి’ అని అంటుంది. అప్పుడు విశ్వక్ ‘ఈ టీ చండాలంగా ఉందని నీ మొఖం మీద పోస్తాను’ అని అంటాడు. విశ్వక్ టీ తాగి ‘ఇది టీ నా? చెండాలంగా ఉంది’ అని అంటాడు. ఈలోపు భద్రావతి టీ బావుందని చెబుతుంది. దాంతో అమూల్య మా అమ్మ నేర్పించింది, మా అమ్మ టీ అంటే మీకు ఇష్టం అంట కదా అని అంటుంది. తరువాత భద్రావతి, సేనాపతి, విశ్వక్ బయటికి వెళ్లేందుకు బయలుదేరుతారు. ఈ లోపు విశ్వకు కడుపులో గుడ గుడలాడుతుంది. దాంతో బాత్రూంకి వెళ్లి వస్తాడు. తర్వాత మళ్ళీ ముగ్గురు బయలుదేరుతారు. ఈ లోపు మళ్ళీ కడుపులో గుడగుడలాడినట్టు అవుతుంది. దాంతో మళ్లీ బాత్రూంకి వెళ్తాడు. అది చూసి అమూల్య నవ్వుకుంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories