బాలకృష్ణ షూటింగ్ మొదలుపెట్టి హీరోయిన్ లేదని ఆపేసిన మూవీ.. మరో హీరోకి హిట్, గన్ మెన్ కూడా ఫోన్ చేశారు

Published : Nov 26, 2026, 12:15 PM IST

సాధారణంగా దర్శకులు హీరోలకు కథ చెప్పడం, రిజెక్ట్ అయితే మరో హీరోతో అదే కథని తెరకెక్కించడం జరుగుతూ ఉంటుంది. కానీ షూటింగ్ మొదలై ఆగిపోయిన మూవీతో శ్రీహరి సూపర్ హిట్ కొట్టారు.

PREV
15
నందమూరి బాలకృష్ణ

స్టార్ హీరోలు దర్శకుడు చెప్పిన కథని రిజెక్ట్ చేస్తే.. మరో హీరో చేతుల్లోకి ఆ సినిమా వెళ్లడం చిత్ర పరిశ్రమలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. నందమూరి బాలకృష్ణ అలా చాలా సినిమాలని రిజెక్ట్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన బాలయ్య సినిమాలు కూడా ఉన్నాయి. దీని గురించి ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
హీరోయిన్ పాత్ర విషయంలో వివాదం, షూటింగ్ ఆపేసిన బాలయ్య

పోసాని కృష్ణ మురళిగారు బాలకృష్ణకి ఒక కథ చెప్పారు. అంతా ఒకే అయింది. బి గోపాల్ దర్శకత్వంలో సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ముహూర్తం షాట్ తో షూటింగ్ ప్రారంభించారు. అది డ్యూయెల్ రోల్ మూవీ. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా నటించాలి. చిన్న హీరో పాత్రకు హీరోయిన్ విషయంలో క్లారిటీ లేదు. ఆ పాత్రకు పూర్తి స్థాయిలో హీరోయిన్ ఉండదు. దీనిని మార్చాలి.. హీరోయిన్ పూర్తి స్థాయిలో ఉండాలి అని బాలకృష్ణ చెప్పారట. కథలో మార్పులు చేయడం ఇక కుదరదని పోసాని తేల్చేశారు.

35
దర్శకుడికి బాలయ్య ఫోన్

దీనితో ఈ సినిమా నుంచి బాలయ్య తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ కథని పోసాని నాకు ఇచ్చారు. శ్రీహరి గారు హీరోగా సినిమా ప్రారంభించాం. ఆ సినిమానే అయోధ్య రామయ్య. షూటింగ్ పూర్తయి సినిమా విడుదలయింది. ఆ టైంలో బాలయ్య, బి గోపాల్ వీళ్లంతా నరసింహ నాయుడు షూటింగ్ కోసం విజయనగరంలో ఉన్నారు. అయోధ్య రామయ్య సినిమాని విజయనగరంలో బాలయ్య, బి గోపాల్ సెకండ్ షో చూసి నాకు ఫోన్ చేశారు.

45
గన్ మెన్ కూడా మెచ్చుకున్నారు

భలే ఉంది సినిమా, అదరగొట్టేశావ్ అని నన్ను అభినందించారు. చివరికి బాలకృష్ణ గన్ మెన్ కూడా నాకు ఫోన్ చేసి అభినందించారు. పోలీసులని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు సార్ అని మెచ్చుకున్నట్లు చంద్ర మహేష్ తెలిపారు.

55
రెండు కథలూ ఒకటేనా ?

అయోధ్య రామయ్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ వివాదం కూడా జరిగింది. అదే సమయంలో వెంకటేష్ గారి జయం మనదేరా షూటింగ్ జరుగుతోంది. రెండు సినిమాల్లో తల్లిగా భానుప్రియ నటిస్తున్నారు. రెండు సినిమాల్లో కోర్ పాయింట్ ఒకటే.. తండ్రి కోసం పగ తీర్చుకునే కొడుకు కథ. అయితే సినిమాలో ఇతర అంశాలు మాత్రం వేరుగా ఉంటాయి. కానీ రామానాయుడు, సురేష్ బాబు గారికి ఎవరో మీ కథతోనే చంద్ర మహేష్ సినిమా చేస్తున్నాడు అని చెప్పారు. రామానాయుడు గారు నన్ను పిలిచి అడిగారు. రెండు కథలు వేరు.. సినిమా రిలీజ్ అయ్యాక మీరే చూడండి అని చెప్పా. చెప్పినట్లుగానే రెండు కథలు వేరనే విషయం మూవీ రిలీజ్ అయ్యాక అందరికీ అర్థం అయింది.

Read more Photos on
click me!

Recommended Stories