ఆ తర్వాత కొన్ని అనుమానాస్పద, భయానక సన్నివేశాలు, మాయా శక్తులు, అవి చేసే దాడిని చూపించారు. అనంతరం పూరావస్తు శాఖ తవ్వకాలు చేయగా, ఒక కేవ్‌లో ఐదు వేల సంవత్సరాల నాటి శిల్పాలు బయటపడినట్టు చూపించారు. ఆ సమయంలోనే నీ హెల్ప్ కావాలని జయరాం అడగ్గా, నాగచైతన్య ఎంట్రీ ఇచ్చారు.
ముందు పనేంటో చెప్పండి అంటూ చైతూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా, యాక్షన్, అడ్వెంచర్ చేస్తున్న సీన్లని చూపించారు. గుహలో కొన్ని కొత్త తరహా శిల్పాలు, రూపాలు కనిపిస్తాయి. వీటి విషయంలో చైతూ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటాడు. ఇంతలో `మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఒక అతీంద్రియ శక్తి తిష్ట వేసింది అని ఒక వాయిస్ చెప్పగా, ఒక చిన్నారి పుట్టుక సస్పెన్స్ గా ఉంటుంది.
ఇంతలో విలన్ రాక్షసుడిగా ఎంట్రీ ఇస్తాడు. మనకు అందని సైన్స్ వాళ్లది, వేది క్ సైన్స్ అని చైతూ చెప్పగా, ఒక కోటలో విలన్ విశ్వరూపం చూపిస్తాడు. ఈ క్రమంలో కొన్ని భయానక యాక్షన్ సీన్లు వస్తాయి. సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం ఆ దేవుడు నిన్ను ఎంచుకున్నాడని చెప్పడం విశేషం.