Soundarya: సౌందర్య చిన్నపిల్లలా అల్లరి చేసేది? ఆమని అంటే ఆమెకు ఎందుకు అంత ఇష్టమంటే?

Published : Nov 26, 2026, 12:07 PM IST

Soundarya:తెలుగు సినీ పరిశ్రమలో సౌందర్య, ఆమని మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సౌందర్యతో తన స్నేహం ఎలా మొదలైంది, వారి మధ్య ఉన్న ఆత్మీయత గురించి ఆమని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

PREV
13
బెంగళూరు నేపథ్యం - సినిమా కాంబినేషన్

సౌందర్య, ఆమని ఇద్దరూ బెంగళూరుకు చెందిన వారు కావడంతో సహజంగానే ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన కనెక్ట్ ఏర్పడింది. ఆ సమయంలో వారిద్దరూ కలిసి మూడు నుంచి ఐదు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అన్న చెల్లెలు, అమ్మ దొంగ వంటి చిత్రాల్లో కలిసి పని చేసినప్పుడు వారి కాంబినేషన్ బాగా కుదిరింది . షూటింగ్ సమయంలో ఇద్దరూ పక్కపక్కన కూర్చునేవారమని ఆమని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో సౌందర్య కూడా ఒక చిన్న పిల్లలాగే ఉండేదని, చాలా అల్లరి చేసేదని ఆమని అన్నారు. ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా కన్నడ పాటలు పాడుకుంటూ, కన్నడలో మాట్లాడుకుంటూ గడిపేవారని చెప్పారు. ఆ విధంగా కన్నడ పాటలు, మాటలతో వారి మధ్య ఆప్యాయత పెరిగి, ఒకరికొకరు వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు.

23
పెళ్లి తర్వాత కూడా కొనసాగిన స్నేహం

ఆమని వివాహం చేసుకున్న తర్వాత కూడా సౌందర్య కుటుంబంతో అనుబంధం అలాగే కొనసాగింది . ఆమని వివాహం అయ్యాక సౌందర్య తల్లి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారని ఆమని తెలిపారు అలాగే సౌందర్య కూడా తమ సొంత బ్యానర్‌లో సినిమా తీస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్‌కు రమ్మని ఆమనిని ఆహ్వానించేది . సౌందర్య సోదరుడు అమర్, తండ్రి సత్యనారాయణ గారి గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు . ఒకసారి మైసూరు సమీపంలోని సోమనాథ్‌పూర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు, ఒంటరిగా బోర్ కొడుతోందని సౌందర్య పిలిచినా, షూటింగ్ కారణంగా ఆమని వెళ్లలేకపోయారు . అయినప్పటికీ వారి స్నేహం చెక్కుచెదరలేదు.

33
తండ్రి మరణం ‌- ప్రశాంత్ కుటీర్ స్టోరీ..

సౌందర్య తండ్రి మరణించినప్పుడు జరిగిన ఒక ఎమోషనల్ సీన్ గురించి ఆమని వివరించారు. ఆ సమయంలో సౌందర్య ఫోన్ చేసి, ఎంతో బాధతో తనను కలవాలని, మాట్లాడాలని కోరారు . అప్పటికే రాత్రి పది గంటలు అయినా, షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌లోని ప్రశాంత్ కుటీర్‌కు ఆమని వెంటనే వెళ్లారు. సౌందర్యకు ప్రశాంత్ కుటీర్‌తో ఎంతో సెంటిమెంట్ ఉండేదని ఆమని చెప్పారు. ఎంత పెద్ద హీరోయిన్ లేదా హీరో వచ్చినా, మిగతా వారంతా ఒక దశలో హోటల్స్ మారినా, సౌందర్య మాత్రం ప్రశాంత్ కుటీర్‌ను వదలలేదని, ఆ గది కూడా మార్చలేదని గుర్తు చేసుకున్నారు . అక్కడ పూర్తిగా శాఖాహార భోజనం దొరుకుతుందని, ఇల్లులాంటి వాతావరణం ఉంటుందని తెలిపారు.

చిన్నపిల్లలా ఏడ్చిన సౌందర్య..

అక్కడికి వెళ్లినప్పుడు సౌందర్య చిన్న పిల్లలా హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు . తమ కుటుంబమనే నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం నాన్నగారి రూపంలో వెళ్లిపోయిందని, ఇక తాను, అమ్మ, అమర్ ముగ్గురే మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట సమయంలో సౌందర్యను ఓదార్చి, ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఏడవద్దని ధైర్యం చెప్పినట్లు ఆమని ఇంటర్వ్యూలో వెల్లడించారు .

Read more Photos on
click me!

Recommended Stories