టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు స్టార్ హీరోయిన్ శ్రీలీల కౌంటర్ ఇచ్చారు. గతంలో బన్నీ తెలుగు హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ కు శ్రీలీల ఎలా రెస్పాండ్ అయ్యిందంటే?
కన్నడ బ్యూటీ శ్రీలీల ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని రీతిలో చాలా తక్కువ టైమ్ లో, వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యావేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల రవితేజ, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, నితిన్ లాంటి తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో శ్రీలీలకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
25
అల్లు అర్జున్ కు శ్రీలీల కౌంటర్
గతంలో టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి శ్రీలీల మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ‘’ అల్లు అర్జున్ చెప్పినట్టు ' తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇది నిజం, మంచిదే. నేను స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకుంటున్నానో నటి ప్రణవి నన్ను అడుగుతోంది. ఇక్కడికి రావడం అంత ఈజీ కాదు, నా కుటుంబానికి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడికి రావడం ఒక డేరింగ్ స్టెప్. కానీ ఇక్కడున్న వాళ్లందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఒక గౌరవప్రదమైన వృత్తి. మనం మన హద్దులు పెట్టుకుంటే, ఎవరూ మనల్ని ఆపలేరు. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్'' అని శ్రీలీల అన్నారు.
35
తెలుగు హీరోయిన్లపై అల్లు అర్జున్ కామెంట్స్
ఇక హీరోయిన్ల గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' సినిమా ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ ఈ విధంగా అన్నారు. '' బేబీ సినిమా చూసి చాలా సంతోషించాను. అప్పుడు నాకు అనిపించింది, చివరికి తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లోకి వచ్చే టైం వచ్చింది. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. శ్రీలీల అనే అమ్మాయి వచ్చి, హీరోయిన్‌గా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో నటిస్తోంది, అలాగే వైష్ణవి కూడా ఇండస్ట్రీకి వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు చేయాలి '' అని అన్నారు.
అంతే కాదు '' వైష్ణవిలాగానే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌కి వచ్చి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను . నేను ఈ వేడుకకు రావడానికి నటి వైష్ణవియే ముఖ్య కారణం. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో మెరవాలి, గొప్పవాళ్లు కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నేను వైష్ణవితో 'అల వైకుంఠపురములో'నటించినప్పుడు, ఇలాంటి అమ్మాయి హీరోయిన్ అయ్యే రోజు వస్తుందని అనుకున్నాను. చివరకు నేను అనుకున్నది జరిగింది. '' అని అల్లు అర్జున్ అన్నారు.
55
ఆడపిల్లల తల్లీ తండ్రులకు విజ్ఞప్తి
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''తెలుగు అమ్మాయిలందరూ టాలీవుడ్‌లోకి వచ్చి మెయిన్‌స్ట్రీమ్ సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. టాలీవుడ్ దేశంలో ఎదుగుతున్న పరిశ్రమలలో ఒకటి, తెలుగు సినిమాలకు ఇప్పుడు ఇండియన్ సినిమాకు దారి చూపిస్తున్నాయి. మన చిత్ర పరిశ్రమ అన్ని విషయాలో మార్గదర్శక పాత్ర పోషిస్తోంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను సినిమా రంగానికి పంపాలని నేను కోరుతున్నాను'' అని అల్లు అర్జున్ అన్నారు.