అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. స్టోరీ పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాత అఖిల్ ఈ చిత్రానికి గ్రీన్ సింగల్ ఇచ్చారు. అఖిల్ కి ఇంత వరకు సరైన హిట్ లేదు. దీనితో లెనిన్ చిత్రాన్ని అఖిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
25
రాయలసీమ నేపథ్యంలో లెనిన్
లెనిన్ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లవ్ అండ్ యాక్షన్ అంశాలతో రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. మొదట హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక ఎంపిక చేశారు. టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ లో శ్రీలీల పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
35
అఖిల్ మూవీ నుంచి శ్రీలీల అవుట్
తాజాగా లెనిన్ చిత్రానికి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేట్లు, షూటింగ్ షెడ్యూల్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ వార్తపై నిర్మాతలు కానీ, శ్రీలీల కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.
రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కే ఈ ప్రేమ కథా చిత్రంపై అఖిల్ బోలెడన్ని అసలు పెట్టుకున్నాడు. ఇటీవల అఖిల్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకోవడం ఊహించని పరిణామమే. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా థమన్ పని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కావాలని చిత్రబృందం ఆశిస్తోంది.
55
శ్రీలీల నటిస్తున్న చిత్రాలు
శ్రీలీల తప్పుకోవడం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపించనుందన్నది తేలాల్సి ఉంది. కొత్త హీరోయిన్ ఎంపికపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. రవితేజ సరసన రెండోసారి మాస్ జాతర చిత్రంలో నటిస్తోంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. శివకార్తికేయన్ పరాశక్తి చిత్రంలో కూడా శ్రీలీల నటిస్తోంది. అదే విధంగా ఆమెకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.