కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే నటుడు.. ఏకంగా కాలర్ పట్టుకోవడంతో డైరెక్టర్ వార్నింగ్

Published : Jun 25, 2025, 01:57 PM IST

కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే ఓ నటుడు ఆయన కాలర్ పట్టుకున్న సంఘటనని ఓ  చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణం రాజు రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
నటుడు సురేష్ కామెంట్స్ 

రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరు చెప్పగానే ఆయన మంచి మనసు అందరికీ గుర్తొస్తుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు షూటింగ్ సమయాల్లో ప్రతి ఆర్టిస్టుతో ఆప్యాయంగా ఉండేవారట. సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజుతో జరిగిన అరుదైన సంఘటనని రివీల్ చేశారు.

నటుడు సురేష్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో నటించారు. కృష్ణంరాజు సురేష్ కలిసి నటించిన చిత్రం పల్నాటి పౌరుషం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1994లో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో సురేష్ నెగిటివ్ రోల్ లో నటించారు. కృష్ణంరాజుకి అల్లుడి పాత్ర ఆయనది.

25
షర్ట్ కాలర్ పట్టుకున్నా

కృష్ణంరాజు కనిపిస్తే ఆయన ముందు కనీసం కూర్చునే ధైర్యం కూడా సురేష్ చేసేవారు కాదట. నిలబడి చేతులు కట్టుకుని వినయంగా ఉండే వారట. ఎంతో వినయంగా ఉండే సురేష్ ఒక సన్నివేశంలో.. కృష్ణంరాజుకి ముందుగా చెప్పకుండానే షర్ట్ కాలర్ పట్టుకున్నారట. సన్నివేశంలో భాగంగా సురేష్ అలా చేశారు. దీంతో కృష్ణంరాజు షాక్ అయ్యారట. ఏంటి ఇలా చేస్తున్నావ్? ఇది నిజంగా సన్నివేశంలో ఉందా.. లేక నీకు ఏమైనా అయిందా అని అడిగారట.

35
ముందుగా చెప్పమని అడిగిన కృష్ణం రాజు

దీంతో సురేష్ భయపడుతూ లేదు సార్ సన్నివేశంలో ఉంది కాబట్టే చేశాను. క్షమించండి అని అడిగాడట. దీంతో కృష్ణంరాజు రియాక్ట్ అవుతా సన్నివేశంలో ఉన్నట్లే చేయి.. కానీ చేసే ముందు నాకు ఒక మాట చెప్పు అని అన్నారట. వినయంగా ఉండే నేను ఒక్కసారిగా షర్ట్ కాలర్ పట్టుకోవడంతో కృష్ణంరాజుకి ఆశ్చర్యంగా అనిపించి అలా అడిగారని సురేష్ తెలిపారు.

ఆ తర్వాత డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య నన్ను పక్కకు పిలిచి ఆయనతో జాగ్రత్త.. ఏదైనా ఉంటే ముందుగానే ఆయనకు చెప్పి అనుమతి తీసుకొని చేయాలి.. నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని వార్నింగ్ ఇచ్చారట.

45
సురేష్ తెలుగు సినిమాలు 

నటుడు సురేష్ 1981లో రామదండు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మోరు, దొంగాట, పట్టుకోండి చూద్దాం, అమ్మో ఒకటో తారీఖు లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సురేష్ బాబుకి అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నాయి. చిరంజీవి ఇద్దరు మిత్రులు చిత్రంలో కూడా సురేష్  నెగిటివ్ రోల్ లో నటించారు. దీనితో చిరంజీవితో కొన్ని సన్నివేశాల్లో చాలా నెగిటివ్ గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. 

55
ఇద్దరు మిత్రులు చిత్రంలో చిరంజీవితో.. 

ఆల్రెడీ కృష్ణంరాజు గారితో అనుభవం అయింది. దీనితో చిరంజీవిగారికే ముందుగానే వెళ్లి చెప్పా. సార్ నేను కొంచెం టెన్షన్ లో ఎలా నటిస్తానో తెలియదు. కొంచెం అడ్జెస్ట్ చేసుకోండి అని చెప్పా. దీనితో చిరంజీవి గారు.. సురేష్ నువ్వేమి టెన్షన్ పడకు.. నెగిటివ్ గా ఎంత బాగా నటించగలవో అలాగే నటించు. ఈ క్యారెక్టర్ కి కావాల్సింది అదే అని ఎంకరేజ్ చేసినట్లు సురేష్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories