రజనీకాంత్, నాగార్జున నటించిన `కూలీ` చిత్రం తెలుగు రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. షాకింగ్ రేట్‌కి ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ ని తీసుకున్నారట.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో సినిమా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా మూవీకి పర్‌ఫెక్ట్ గా నిలిచింది.
అదే సమయంలో అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ విషయంలో దుమ్మురేపింది. అక్కడి రైట్స్ ఏకంగా రూ.80కోట్లకు అమ్ముడు పోయాయట. ఇప్పుడు తెలుగు రైటర్స్ పరంగానూ సత్తా చాటుతోంది.
25
`కూలీ` తెలుగు రైట్స్ ఎంతంటే?
లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు రైట్స్ కి సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది. భారీ రేట్‌కి తెలుగు స్టేట్స్ రైట్స్ అమ్ముడు పోయాయట. ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ కోసం పోటీ పడ్డారట.
అయితే చివరికి ముగ్గురు కలిపి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ మూవీ కోసం ఏకంగా రూ.48 కోట్లు పెట్టినట్టు సమాచారం.
సినిమాకి బజ్ ఉన్న నేపథ్యంలో, పైగా లోకేష్ కనగరాజ్ మూవీ కావడంతో ఇంత భారీ రేట్‌కి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
35
`కూలీ` తెలుగు బిజినెస్‌లో నాగార్జున క్రేజ్
ఇదిలా ఉంటే ఈ రైట్స్ విషయంలో నాగార్జున ప్రభావం కనిపిస్తుంది. ఆయన ఇటీవల నటించిన `కుబేర` చిత్రం మంచి ఆదరణ పొందింది. హిట్ దిశగా వెళ్తుంది. తెలుగులో ఈ చిత్రం భారీ వసూళ్లని రాబడుతుంది.
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్ అన్నీ కలిపి ఓ ఎత్తైతే, తెలుగు కలెక్షన్లు అంతకు మించి ఉన్నాయి. దీంతో సినిమా మంచి వసూళ్లని రాబట్టింది. అందులో నాగార్జున, శేఖర్ కమ్ముల ల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
అదే మ్యాజిక్ `కూలీ` విషయంలో వర్కౌట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. పైగా ఈ మూవీలో నాగార్జున పాత్ర మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందట. ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తోంది.
లోకేష్ సినిమాల్లో విలన్ పాత్ర అయినా చాలాస్ట్రాంగ్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నటుడిగా ఎలివేట్ అవ్వడానికి ఉంటుంది. అదే ఉద్దేశ్యంతో నాగ్ ఈ మూవీ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే నాగ్‌కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ లీక్ గూస్‌బంమ్స్ తెప్పించింది. అంచనాలను పెంచేసింది. ఇదంతా తెలుగు రైట్స్ డిమాండ్ పెరగడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు.
55
గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో `కూలీ`
ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన `కూలీ` చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించగా, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.
క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఇచ్చి అదరగొడతాడని అంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్ ఇందులో హైలైట్‌గా ఉండబోతుందని టాక్.