Sreeleela చాలా కాస్ట్లీ గురు.. ఒక్కో సినిమాకి, యాడ్స్ కి అందుకుంటున్న పారితోషికం తెలిస్తే మైండ్‌ బ్లాక్‌?

Published : Nov 20, 2023, 05:48 PM ISTUpdated : Nov 20, 2023, 07:33 PM IST

టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా మారింది శ్రీలీల. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లలోనే స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని దున్నేస్తుంది. ఆమె యంగ్‌ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరిని ఓ చుట్టేస్తుంది. 

PREV
18
Sreeleela చాలా కాస్ట్లీ గురు.. ఒక్కో సినిమాకి, యాడ్స్ కి అందుకుంటున్న పారితోషికం తెలిస్తే మైండ్‌ బ్లాక్‌?

శ్రీలీల ఒక సునామీలా వచ్చింది. ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో పాగా వేసింది. తన పంజా విసిరి అత్యధిక ఆఫర్లని సొంతం చేసుకుంది. మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాని విధంగా ఆమె క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఆ విషయంలో శ్రీలీల జోరుకి స్టార్‌ బ్యూటీస్‌ అంతా షాక్‌ అవుతున్నారు. 

28

శ్రీలీల రాకముందు కాజల్‌, రష్మిక, సమంత, పూజా వంటి కథానాయిక జోరు సాగింది. కానీ ఇప్పుడు వాళ్లందరిని పక్కకి నెట్టేసి అందరిలోనూ ఫోకస్‌ పాయింట్‌గా నిలుస్తుంది. అంతేకాదు హీరోయిన్‌గా వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌ శ్రీలీల అనేంతగా మారింది. ఆమెని మేకర్స్ ఎంకరేజ్‌ చేయడం అందుకు కారణం. 

38

శ్రీలీల అద్భుతమైన డాన్సర్‌. ఆమె డాన్సులకే ఇండస్ట్రీ ఫిదా అయ్యింది. `పెళ్లిసందడి`, `ధమాఖా` చిత్రాల్లో ఆమె డాన్సులు చూస్తే మతిపోవాల్సిందే. `ధమాఖా` మూవీ ఆడిందంటే శ్రీలీల కారణంగానే అని అంతా అంటారు. అలా మ్యాజిక్‌ చేసింది. వెండితెరపై మెస్మరేజ్‌ చేస్తుందీ క్యూట్‌ బ్యూటీ. 
 

48

 శ్రీలీల తెలుగమ్మాయి. బెంగుళూరు నుంచి వచ్చినా, మూలాలు మాత్రం తెలుగువే. అయితే అక్కడి నుంచి రావడం కారణంగానే ఎంకరేజ్‌ చేస్తున్నారు. దీనికితోడు కమ్యూనిటీ లెక్కలు కూడా పనిచేస్తున్నాయి. పైగా మంచి టాలెంటెడ్‌ కావడంతో ఆమె కావాలని యంగ్‌ హీరోల నుంచి స్టార్స్ వరకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పుడు మోస్ట్ డిమాండెడ్‌ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. 

58

తనకు ఉన్న డిమాండ్లకి తగ్గట్టుగానే ఆమె పారితోషికం కూడా గట్టిగానే తీసుకుంటుంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతని నిజం చేస్తూ పారితోషికం గట్టిగానే తీసుకుంటుంది. శ్రీలీల పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె ఒక్కో మూవీకి ఎంత తీసుకుంటుందనేది షాకిస్తుంది. 

68

ప్రస్తుతం శ్రీలీల ఒక్కో సినిమాకి మూడు కోట్లు తీసుకుంటుందట. అందులో రెండున్న కోట్లు తన పారితోషికం, మరో యాభై లక్షలు ఇతర ఖర్చుల లెక్కగా తీసుకుంటుందని తెలుస్తుంది. సుమారు ఆమెకి ఒక్కో మూవీకి మూడు కోట్ల వరకు ముట్టుతున్నాయని టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌.  

78

అయితే ఆమె సినిమాని బట్జి, బడ్జెట్‌ని బట్టి అందులో కొంత మార్పు ఉంటుందని తెలుస్తుంది. అలాగే యాడ్స్ విషయంలోనూ గట్టిగానే అందుకుంటుందట. ఆమె ఒక్కో యాడ్‌కి సుమారు 12లక్షలు వసూలు చేస్తుందట. షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్ వంటి వాటికి గంటకి పది నుంచి 12లక్షల వరకు అందుకుంటుందని సమాచారం. క్రేజ్‌ని డిమాండ్‌ని బట్టి మేకర్స్ ఆ స్థాయిలో ఇస్తున్నారని, ఇంకా ఎక్కువగానే ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్‌. 

88

ఇక ప్రస్తుతం శ్రీలీల.. `ఆదికేశవ` మూవీతో ఈ శుక్రవారం రాబోతుంది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రమిది. దీంతోపాటు డిసెంబర్‌ మొదటి వారంలో `ఎక్స్ ట్రా` మూవీతో, సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో రాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చేస్తుంది. విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి మూవీలోనూ ఉంది. కానీ ఈ మూవీ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది.

Read More: Pranitha Subhash: జబ్బలపై జారిపోయే టాప్‌.. విశాలమైన మెడ అందంతో మత్తెక్కిస్తున్న పవన్‌ బ్యూటీ..

Also Read: #AadiKesava:అసలు బజ్ లేదేంటి బాస్, శ్రీలీల ఎంతని మోస్తుంది

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories