అయితే ఈసినిమా గురించి మరో వాదన కూడిా వినిపిస్తోంది. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అందుకే శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయి. హీరోకోసం పోటీ పడే రెండు పాత్రలో వీరు కనిపిస్తారట. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3 చిత్రంలో నటిస్తున్నారు.