ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. సందీప్ వంగా స్పిరిట్ ప్లాన్ రివీల్..

Published : Sep 06, 2025, 02:03 PM IST

Spirit Movie Update: డార్లింగ్ ప్రభాస్- డేరింగ్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో స్పిరిట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అండ్ షాకింగ్ అప్డేట్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

PREV
15
షాకింగ్ అప్డేట్

Spirit Movie Update: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ స్పిరిట్ ( Spirit). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతోన్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లక ముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 

తాజాగా ఓ టీవీ ఈవెంట్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయాలా స్పిరిట్ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ స్పిరిట్ మూవీ అప్డేట్ ఏంటీ? సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్ ఏంటీ?

25
ప్రభాస్ దూకుడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ది రాజా సాబ్ , హను రాఘవపూడి నిర్మిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. ప్రభాస్ ఎలాంటి ఖాళీ లేకుండా తెగ కష్టపడుతున్నారు. ఇక ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి అయిన తర్వాతే ఆయన Spirit మూవీలో సెట్స్‌పైకి అడుగు పెట్టనున్నారు. అంతేకాక, Spirit షూటింగ్ మొదలుపెట్టే ముందే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే, Spirit ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ప్రభాస్ మరొక సినిమా చేయకూడదని షరతు పెట్టారంట. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నట్టు టాక్.

35
ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్ గేమ్

డార్లింగ్ ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న Spirit మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దర్శకుడు వంగా ఇప్పటికే పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభాస్ డేట్స్ సమస్యతో వెయిటింగ్ గేమ్ కొనసాగుతోంది. 

ఫెడరేషన్ సమ్మె కారణంగా ప్రభాస్ విలువైన షూటింగ్ డేట్స్ వృథా కావడంతో, ఆయన ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల షెడ్యూల్స్‌ను మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో Spirit కొంత వెనక్కి వెళ్లినా, ప్రాజెక్ట్‌పై హైప్ మాత్రం తగ్గడం లేదు.

45
డైరెక్టర్ సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇక స్పిరిట్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రభాస్ లుక్ పర్ఫెక్ట్‌గా రావాలని డైరెక్టర్ సందీప్ వంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. డైరెక్టర్ సూచనల మేరకు ప్రభాస్ కొంచెం బరువు తగ్గారు. కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ లుక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 

ఈ మూవీలో ప్రభాస్ రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారని సమాచారం. ప్రధానంగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూనే, ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాఫియా డాన్ పాత్రలో కూడా నటించనున్నారు. 

అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన సందీప్ వంగా Spirit ద్వారా కూడా అదే ఎక్సపెక్టేషన్స్ కలిగించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. ప్రారంభంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్‌ను కాబట్టి ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.

55
ప్రభాస్ పై సందీప్ కామెంట్స్..

జగపతి బాబు నిర్వహిస్తున్న జయంబు నిశ్చయంబు ప్రొగ్రామ్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. ఈ సంబంధంగా ప్రభాస్ స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుతూ.. స్పిరిట్ బీజీఎం వర్క్స్ 70 శాతం పూర్తయిందని తెలిపారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని స్పష్టం చేశారు. గతంలో యానిమల్ మూవీ టైంలో కూడా 80 శాతం బీజీఎం వర్క్ పూర్తి చేసిన తరువాత సెట్స్‌కి వెళ్లామని తెలిపారు. 

సీన్ అవుట్‌పుట్ ముందే కనిపించడం, టైం అండ్ ప్రొడక్షన్ వర్క్ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో తనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉందనీ, ప్రభాస్ చాలా ట్రాన్స్పరెట్ గా ఉంటారని తెలిపారు. 

ఆయన చాలా సూటిగా, చాలా మధురంగా ఉంటారని, త్వరలోనే తాము షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం. డిసెంబర్‌ కన్నా ముందే చిత్రీకరణ ప్రారంభం అయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories