ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చివరగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు.
DID YOU KNOW ?
పవన్ నుంచి వరుస చిత్రాలు
హరిహర వీరమల్లు రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. పవన్ నుంచి మరో రెండు చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. సెప్టెంబర్ లో ఓజి రిలీజ్ కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
25
కోహినూర్ డిమాండ్ నేపథ్యంలో..
హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్, జ్యోతి కృష్ణ కోహినూర్ డైమండ్ మొఘల్ చక్రవర్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది అనే అంశంతో తెరకెక్కించారు. అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన సన్నివేశాలు కూడా బలంగా ఉన్నాయి. మొత్తంగా హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకులని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.
35
త్వరలో ఓటీటీలోకి హరిహర వీరమల్లు
థియేటర్లలో అంతగా మెప్పించలేని చిత్రాలని నిర్మాతలు వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకువస్తుంటారు. హరిహర వీరమల్లు చిత్రం విషయంలో కూడా అదే జరగబోతున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు చిత్రాన్ని నెలరోజుల్లోపే ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అదిరిపోయే క్రేజీ డేట్ ని ఎంచుకున్నారట. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగష్టు 22 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
55
చిరంజీవికి పుట్టినరోజు కానుక
హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ పై డెక్కన్ క్రోనికల్ లో కథనం వెలువడింది. ఈ కథనం ప్రకారం హరిహర వీరమల్లు ఆగష్టు 22న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అందించే కానుక ఇదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు.