జియో హాట్ స్టార్ లో ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆ చిత్రాల ఏంటి, ఎలాంటి కథాంశంతో ఆకట్టుకుంటున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఓటీటీ వేదికలపై ఆసక్తికరంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఓటీటీ చిత్రాలకు ఉన్న డిమాండ్ చూసి మేకర్స్ ఒరిజినల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ దిగ్గజ సంస్థల్లో జియో హాట్ స్టార్ ఒకటి. ముందుగా హాట్ స్టార్ గా మొదలైన ఈ సంస్థ ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గా ఇప్పుడు జియో హాట్ స్టార్ గా మారింది. జియో హాట్ స్టార్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
DID YOU KNOW ?
ఆయన చేసిన పోరాటం ఆధారంగా కేసరి చాప్టర్ 2
అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 చిత్రాన్ని జలియన్ వాలాబాగ్ ఉదంతంపై పోరాటం చేసిన న్యాయవాది సి శంకరన్ నాయర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.
26
డీఎన్ఏ
ఈ చిత్రంలో నటుడు అథర్వ ప్రేమలో విఫలమై తాగుడుకి బానిసైన యువకుడిగా నటించారు. అలాంటి వ్యక్తికి మానసిక సమస్యలతో బాధపడే దివ్య(నిమిషా సజయన్) అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వీరికి బాబు జన్మిస్తాడు. ఆసుపత్రిలో ప్రసవం జరుగుతుంది. ఆసుపత్రిలో నర్సులు బిడ్డని దివ్య చేతుల్లో పెడతారు. పిల్లాడిని చేతుల్లోకి తీసుకోగానే తన బిడ్డ కాదని దివ్య గోల చేస్తుంది. దివ్యకి మానసిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆమె మాటలని ఎవరూ నమ్మరు.
కానీ ఆమె బలంగా అతడు తన బిడ్డ కాదని చెప్పడంతో అథర్వకి అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. నిజంగానే ఆ పిల్లాడు వారి కొడుకు కాదని తెలుస్తుంది. వారి నిజమైన బిడ్డ ఏమయ్యాడు ? పురిటిలోనే ఎవరు మార్చేశారు.. చివరికి భార్య భర్తలు తమ బిడ్డని ఎలా దక్కించుకున్నారు అనేది మిగిలిన కథ. నీల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది.
36
రోంత్
మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు దాదాపుగా నిరాశ పరచని విధంగా ఉంటాయి. ఇటీవల రోంత్ అనే చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ఎలా నిర్వహిస్తారో కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి అనేక సంఘటనలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ విషయాలు ఏంటి అనేది సస్పెస్. ఇది చూడదగ్గ చిత్రం.
జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ లాయర్ పాత్రలో నటించారు. బ్రిటిష్ అధికారులకు అనుకూలంగా పనిచేసే లాయర్.. చివరికి వారికి ఎలా ఎదురుతిరిగారు ? జలియన్ వాలాబాగ్ వెనుక ఉన్న కుట్రని ఎలా ఛేదించారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
56
సర్ జమీన్
కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన సర్ జమీన్ చిత్రం జూలై 25న డైరెక్ట్ గా జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ జియో హాట్ స్టార్ లో టాప్ 5 ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు.
66
శుభం
సమంత నిర్మించిన శుభం చిత్రం ఆ మధ్యన థియేటర్లలో విడుదలై మంచి విజయం దక్కించుకుంది. ఆ తర్వాత జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పటికీ ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.