ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య కుటుంబం అమెరికాకి వచ్చేస్తారు. అక్కడ సౌందర్య హిమని భోజనం చేయమంటే, నేను చెయ్యను నానమ్మ,మనం ఇండియా వెళ్ళిపోదాము. అక్కడ శౌర్య ఒంటరిగా ఉంటుంది అని అనగా సౌందర్య,మనం ఇప్పుడే కదా వచ్చాము నాలుగు రోజులు ఉంటే అలవాటైపోతుంది అని అంటుంది. దానికి హిమ, వద్దు నానమ్మ అని అంటుంది.శౌర్యని వెతకడానికి మనుషుల్ని పంపాను దొరికిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేద్దాము అని సౌందర్య అంటుంది.