Karthika Deepam: దీప చేతిరాతను గుర్తుపట్టిన శౌర్య... కన్నకొడుకును తీసుకెళ్లిపోయిన మోనిత!

Published : Sep 17, 2022, 07:41 AM ISTUpdated : Sep 17, 2022, 07:52 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

PREV
19
Karthika Deepam: దీప చేతిరాతను గుర్తుపట్టిన శౌర్య... కన్నకొడుకును తీసుకెళ్లిపోయిన మోనిత!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప, వాళ్ళ అన్నయ్య ఇంటికి పరిగెట్టుకొని వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు, ఇదేంట్రా బయటికి వెళ్ళింది అని చెప్పావు ఇక్కడికి వస్తుంది అని ఆశ్చర్య పోతుంది. అప్పుడు దీపా పరిగెత్తుకుంటూ వచ్చి,అన్నయ్య అక్కడ వైద్యశాల లేదు.ఇదంతా మోనిత కుట్ర,నన్ను మోసం చేసింది ఆ ఆటో వాడు చెప్పకపోయి ఉంటే నేను వెళ్లి నిరాశతో తిరిగి వచ్చేదాన్ని. అసలు ఏం చేస్తుంది, రెండు రోజులు నేను లేకపోయేసరికి డాక్టర్ బాబుని ఎక్కడికైనా తీసుకువెళ్లాలనుకుంటుందా అని భయపడుతుంది దీప.  అప్పుడు వాళ్ళ అన్నయ్య,వెళ్లి డాక్టర్ బాబు ఉన్నారో లేదో చూసావా అని అడగగా, ఇప్పుడే చూసి వస్తున్నాను అన్నయ్య ఉన్నారు అని అంటుంది దీప. 

29

నాకెందుకో డాక్టర్ బాబుని తీసుకువెళ్లడానికి కాదనిపిస్తుంది అమ్మ ఇంకేదైనా కారణం ఉండొచ్చు అని అంటాడు దీప వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత సీన్లో మోనిత, నేను వెళ్ళొస్తున్నాను శివ, నువ్వు కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకో శివ అని అంటాది. అప్పుడు శివ,సరే మేడం నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అయినా మీరు సార్ ని కూడా తీసుకెళ్లొచ్చు కదా అక్కడికి  అని అడగగా మోనిత, ఎవరికో ఫోన్ చేసి నాకు ఒక కొత్త డ్రైవర్,అసిస్టెంట్ కావాలి. ఇప్పుడు ఉన్నవాడు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు అని అనగా శివ, మోనిత కాళ్లు పట్టుకొని ఇంకెప్పుడు అడగను మేడం అని బతిమిలాడతాడు. 

39

అప్పుడు మో, వంటలక్క ఊర్లో లేదు పొరపాటున వచ్చిన సరే కార్తీక్ నీడ కూడా తగలకుండా చూడు అని చెప్తుంది. మొనిత వెళ్లిపోయిన తర్వాత శివ మనసులో, సార్ ను తీసుకువెళ్తే ప్రాబ్లం అవుతదా? ఏదేమైనా వంటలకే మంచిది ఒక మాట మీద నిలబడుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సిన్లో, సౌర్య వాళ్ళ బాబాయ్, సరుకులు అన్ని తీసుకొని వస్తాడు.ఇన్ని సరుకులు ఎందుకు తెచ్చారు హోటల్ పెడుతున్నార అని శౌర్య అడగగా లేదమ్మా పక్కింటికి బంధువులు వచ్చారట.భోజనాలకి అడిగారు అని అంటుంది శౌర్య వాళ్ళ పిన్ని. అప్పుడు శౌర్య,డబ్బులు ఇస్తారు కదా అని అడుగుతుంది. ఇస్తారమ్మా కానీ ఇంత  అని ఏమీ అనుకోలేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంతా అని అంటుంది.అ

49

అప్పుడు శౌర్య,మా అమ్మ కూడా అంతే. బేరం ఆడేది కాదు వాళ్ళెంత ఇస్తే అంతే తీసుకునేది. ఎప్పుడూ పక్క వాళ్లకి సహాయం చేస్తానని ఆలోచన ఉండేది అని అనగా,శౌర్య వాళ్ళ పిన్ని అవునమ్మా అందుకే మంచోళ్లను ఎప్పుడూ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు అని అంటుంది. అప్పుడు శౌర్యకి కోపం వచ్చి,మా అమ్మని దేవుడు తీసుకెళ్లలేదు ఏం మాట్లాడుతున్నావ్. నాకు నమ్మకం ఉంది అని అంటుంది శౌర్య.ఇంతలో ఆ సామాన్ల లిస్టు పేపర్ చూసి ఈ చేతిరాత ఎవరు రాశారు అమ్మది లాగే ఉన్నది అని అనగా, ఇందాక నువ్వు ఒకరితో ఫోన్లో మాట్లాడావు కదా ఆవిడదే అమ్మ అని అంటాడు సౌర్య వాళ్ళ బాబాయ్.

59

అప్పుడు శౌర్య, నేను చెప్పాను కదా బాబాయ్, ఆవిడ మా అమ్మ గొంతులాగే ఉన్నది, ఇది మా అమ్మ చేతిరాతే.అమ్మ కచ్చితంగా ఇక్కడ ఉంది. సౌర్య ఎలాగైనా అమ్మని వెతకాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో సౌందర్య ఆనంద్ రావు, హిమ కారులో వెళ్తున్నప్పుడు ఆనందరావు సౌందర్యతో, అయినా మోనిత ఆనంద్ ని మన దగ్గర వదలకుండా అక్కడ ఎందుకు వదిలింది అని అడగగా, మంచి పనులు చేస్తే అది మోనిత ఎందుకు అవుతుంది. అయినా మొన్న రెస్టారెంట్లో కలిసినప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ తనతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాదు అని ఎక్కువ మాట్లాడలేదు అని అంటుంది సౌందర్య. అప్పుడు ఆనందరావు, అయినా మన మనవడు  ఇంకొకళ్ల దగ్గర ఉండడం ఎందుకు తెచ్చేసుకుందాము అని అనగా హిమ, లక్ష్మణ్ అంకుల్ ఒప్పుకుంటారా అని అడుగుతుంది. 

69

వాడెలా ఒప్పుకొడో  నేను చూస్తాను నువ్వేం భయపడొద్దు మనం ఆనంద్ నీ  తీసుకొద్దాం  అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత సీన్లో మోనిత, లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆనంద్ ని తీసుకొని వస్తుంది. నేను తీసుకు వెళ్తున్నాను అని మీరు ఆస్తినేమీ తిరిగి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే ఉంచుకోండి అని అనగా, బాబుని వదిలి వెళ్ళడం మాకు చాలా బాధగా ఉన్నదమ్మ బాబే లేనప్పుడు మాకు ఆస్తి వద్దు అని అంటారు వాళ్ళు. అప్పుడు మోనిత వీల్లెంత మంచివారు అని మనసులో అనుకొని, నేను అప్పుడప్పుడు బాబుని ఇక్కడికి తీసుకు వస్తాను మీరు బాబు గురించి బెంగపడొద్దు అని అంటుంది. అప్పుడు వాళ్లు, మరి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు అని అనగా, ఇంకా ఏమీ అనుకోలేదు అని చెప్పి బాబును తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత.

79

వాళ్ళు వెళ్లిపోయిన వెంటనే సౌందర్య వాళ్ళు అక్కడికి వచ్చి బాబు కోసం అడగగా లక్ష్మణ్, అరుణలు ఇలా జరిగిన విషయం అంతా చెప్తారు.అప్పుడు సౌందర్య, మోనిత  తీసుకువెళ్లిపోయిందా అని అనుకుంటుంది. అప్పుడు ఆనందరావు, పోనీలే సౌందర్య, మోనితే తీసుకెళ్లింది, లేకపోతే మనం తీసుకొద్దాం అనుకున్నాము అని అనగా సౌందర్య వాళ్ళతో,మళ్ళీ మోనిత ఇటు వైపు వచ్చిన, ఆనంద్ ని తెచ్చినా మాకు వెంటనే చెప్పండి అని అంటాది. ఆ తర్వాత సీన్లో కార్తీక్ పాత పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు శివ, సార్ మీకు గతం మర్చిపోయిన సరే పాత పాటలు బాగా గుర్తున్నాయి అని అంటాడు. 

89

మొన్న విన్నాను లేరా అని కార్తీక్ అనగా లేదు సార్ మేడం వెళ్లిపోయిన ఆనందంలో మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అని అంటాడు శివ. అప్పుడు కార్తీక్, శివ నీ చెంప మీద కొట్టి, మేడం వెళ్ళిపోతే నాకెందుకు ఆనంద్ రా, ఈ మాట మీ మేడం వింటే ఎంత బాధపడతారు అని అంటాడు.అప్పుడు శివ,అంటే సర్ మొన్న మేడం తిట్టిన విషయం కూడా మర్చిపోయారా అని అనుకుంటాడు.ఇంతలో దీప అక్కడికి వస్తుంది. దీపక్క ఎక్కడికి వెళ్తున్నావు లోపల ఎవలు లేరు అని అంటాడు శివ. అప్పుడు దీప,వీళ్ళు చెక్కేసారా ఏంటి అని భయపడుతుంది.ఇంతలో కార్తీక్ పాటలు విని హమ్మయ్య డాక్టర్ బాబు లోపల ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడు శివతో, నేను మీ మేడంని కలవడానికి వచ్చాను అని అనగా, మా మేడం లేరు బయటికి వెళ్లారు అని అంటాడు శివ.
 

99

ఎక్కడికి వెళ్లిందో అని దీప అడగగా, నేను మీకు ఇంకేమీ చెప్పను దయచేసి వెళ్ళిపోండి లేకపోతే నా ఉద్యోగం ఊడిపోద్ది అని అంటాడు. అప్పుడు దీప, మోనిత వీడిని బాగా కంట్రోల్ లో పెట్టింది, సూటిగా అడిగితే చెప్పట్లేదు అని అనుకోని, బయటకంటే ఇక్కడికే ఎక్కడికో వెళ్ళుంటారు. గంటలో వస్తాను అని అంటుంది.అప్పుడు శివ, గంట కాదు కదా నాలుగు గంటలైనా రారు చెన్నై వెళ్లారు అని అంటాడు. ఇంకేం అడగొదు దీపక్క నా ఉద్యోగం ఊడిపోతే అర్థం చేసుకొ నీ  పంపించేస్తాడు శివ. అప్పుడు దీప మనసులో, ఆహా ఇదా సంగతి, అది బయటికి వెళ్లే సమయంలో నేను డాక్టర్ బాబుని ఏమైనా చేస్తాను అని అనుకుంతుందా, ఇప్పుడు చెప్తాను దీని పని అనుకుంటుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories