విరహ వేదనతో రకుల్‌ వీకెండ్‌ ట్రీట్‌.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో మేగజీన్‌ కోసం రెచ్చిపోయిన హాట్‌ బ్యూటీ

Published : Sep 17, 2022, 07:40 AM ISTUpdated : Sep 17, 2022, 10:38 AM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో రచ్చ రేపుతుంది. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు అక్కడ అందాల ప్రదర్శనలో బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. వరుసగా ఫోటో షూట్లతో కుర్రాళ్లకి ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
18
విరహ వేదనతో రకుల్‌ వీకెండ్‌ ట్రీట్‌.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో మేగజీన్‌ కోసం రెచ్చిపోయిన హాట్‌ బ్యూటీ

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫ్యాన్స్ కి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. డిఫరెంట్‌ ట్రెండీ వేర్‌లో విరహాలు పోతూ రకుల్‌ పంచుకున్న ఫోటోలు నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. ఈ అమ్మడి హాట్‌ భంగిమలు చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. 
 

28

రకుల్‌ `గ్రాజియా` అనే మేగజీన్ కోసం ఇంతటి హాట్‌ పోజులిచ్చింది. విరహంతో కూడిన పోజులిస్తూ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. సోఫాలో ఆమె హాట్‌ సిట్టింగ్‌లో ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. రకుల్ వీకెండ్‌ ట్రీట్‌కి పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 
 

38

సౌత్‌ నుంచి నార్త్ కి వెళ్లాక క్రమంగా గ్లామర్‌ డోస్ పెంచుతుంది రకుల్. సినిమాల్లో ఆమె పొదుపైను దుస్తులేసుకుని రచ్చ లేపుతుంది. నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసింది. ఇటీవల కాలంలో రకుల్ ఫోటో షూట్లు తెగ వైరల్‌ అవుతుండటం విశేషం. 
 

48

సౌత్‌ని ఓ ఊపు ఊపేసింది రకుల్. తెలుగు, తమిళంలో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. టాలీవుడ్‌లో దాదాపు స్టార్స్ అందరితోనూ ఆడిపాడింది. చివరికి నాగార్జున వంటి సీనియర్‌తోనూ నటించింది. దాదాపు అందరు హీరోలతో ఒకటి రెండు సినిమాలు చేసిన రకుల్‌ ఇప్పుడు ఇండస్ట్రీని మార్చేసింది. 
 

58

సౌత్‌ నుంచి నార్త్ కి షిఫ్ట్ అయ్యింది. తొలినాళ్లలో ఆమె హిందీలో చేసినా సక్సెస్‌ దక్కలేదు. దీంతో గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమైంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది. యంగ్‌ హీరోల నుంచి అజయ్‌ దేవగన్, అక్షయ్‌ కుమార్‌ వంటి సీనియర్‌ స్టార్‌ హీరోల వరకు అందరితోనూ జత కడుతుంది రకుల్. 
 

68

ఎంత చేసినా హిందీలో ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్‌ కూడా అందుకోకపోవడం గమనార్హం. విచారకరం. వరుసగా అరడజనులు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ సక్సెసే ఆమెకి పరీక్ష పెడుతుంది. ఐరన్‌ లెగ్‌ అని ముద్ర పడలేదుగానీ, దానికి ఏమాత్రం తీసిపోని విధంగా మారిపోయింది రకుల్. 
 

78

2018లో వచ్చిన `అయారి` చిత్రం నుంచి నార్త్ లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది రకుల్. మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ అప్పుడు తెలుగుపైనే ఫోకస్‌తో ఉంది. `దే దేప్యార్‌ దే`లో అజయ్‌ దేవగన్‌తో కలిసి నటించింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో తనకు పట్టు దొరికింది. 
 

88

`మర్జావాన్‌`, `సిమ్లా మిర్చి`, `సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌, `, `ఎటాక్‌`, `రన్‌వే34`, `కట్ పుట్లీ` చిత్రాల్లో మెరిసింది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. ప్రస్తుతం ఆమె చేతిలో `థ్యాంక్‌ గాడ్‌`, `డాక్టర్‌ జీ`, `ఛట్రివాలి`తోపాటు తమిళంలో `ఇండియన్‌ 2`, `అయలాన్‌` చిత్రాలున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories