Ajith Kumar: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటుడు అజిత్ తొలిసారిగా స్పందించారు. జనాలని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అని అనుకునే మనస్తత్వం వల్లే ఆ సంఘటన జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరూర్‌లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పిల్లలతో సహా 41 మంది చనిపోయారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విజయ్‌ను అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.
24
తొలిసారి స్పందించిన అజిత్
కరూర్ ఘటనపై నటుడు అజిత్ తొలిసారిగా స్పందించారు. జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవడం, మీడియా హైప్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. జనాన్ని చేర్చి మనమేంటో చూపించే సంస్కృతికి ముగింపు పలకాలి.
34
ఇలా జరగడం ఇండస్ట్రీకి కళంకం
హీరో ఆరాధన సంస్కృతి సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెస్తుంది. విజయం అడవి గుర్రం లాంటిది, అదుపు చేయలేకపోతే కింద పడేస్తుంది. సినిమా హీరోలు పాల్గొన్న ఈవెంట్లలో ఇలా జరగడం ఇండస్ట్రీకి కళంకం అని అజిత్ అన్నారు.
అభిమానుల ప్రేమ కోసమే మేం పనిచేస్తాం. మీ ప్రాణం ముఖ్యం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో జనాన్ని పోగేయడం పెద్ద విషయం కాదు. మన పలుకుబడి చూపించేందుకు జనసమీకరణ ఆపాలి. ఈ తొక్కిసలాట సంఘటనకి ఒక్కరిని బాధ్యులని చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఉన్న అందరూ, వారి మనస్తత్వాలు ఈ సంఘటనకి కారణం అని అజిత్ అన్నారు.