బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ అరాచకం, గబ్బర్ సింగ్ రికార్డులు బ్రేక్.. తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా

Published : Nov 01, 2025, 12:12 PM IST

బాహుబలి ది ఎపిక్ చిత్రం రీ రిలీజ్ లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. దీనితో బాహుబలి చిత్ర యూనిట్ రెండు భాగాలని ఎడిట్ చేసి ఒకే వర్షన్ గా రిలీజ్ చేశారు. దీనితో బాహుబలి ది ఎపిక్ అని పేరు పెట్టారు. “బాహుబలి – ది ఎపిక్” రీ-రిలీజ్‌ లో తొలి రోజే దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది.

25
గబ్బర్ సింగ్ రికార్డులు బ్రేక్ 

ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో రీ-రిలీజ్ అవగా, ప్రేక్షకుల ఆదరణతో మొదటి రోజే రూ. 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ వాల్యూ 18 కోట్లు గా ఉంది. దీంతో ఇప్పటివరకు రీ-రిలీజ్ సినిమాల కేటగిరీలో అత్యధిక ఓపెనింగ్ రికార్డు కలిగిన పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” (రూ. 5.75 కోట్లు) రికార్డును బాహుబలి అధిగమించింది.గబ్బర్ సింగ్ మూవ్ 5.75 కోట్ల నెట్, 8 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. తమిళంలో దళపతి విజయ్ గిల్లీ మూవీ 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మూవీ ఆ సినిమాల రీ రిలీజ్ కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో అధికమించడం విశేషం. 

35
భారీ బడ్జెట్ లో బాహుబలి ది ఎటర్నల్ వార్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ రీ-రిలీజ్‌కు భారీ స్పందన చూపుతున్నారు. ముఖ్యంగా భారత్‌లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లో హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తోంది. రీ రిలీజ్ తో బాహుబలి చిత్ర యూనిట్ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేటెడ్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ది ఎటర్నల్ వార్ రూపొందనుంది.

45
ఉత్తర అమెరికాలోనూ రికార్డులు

భారతదేశంలో మాత్రమే కాకుండా, ఉత్తర అమెరికాలో కూడా బాహుబలి ది ఎపిక్ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, మొదటి రోజు  అదే రోజు రాత్రి వరకు USD 500,000 (సుమారు రూ. 4.15 కోట్లు) దాటినట్లు సమాచారం. ఇది ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రాలలో అత్యధిక కలెక్షన్‌లలో ఒకటిగా నిలిచింది.

55
ప్రధాన తారాగణం

బాహుబలి దృశ్య కావ్యంలో ప్రభాస్ (అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ), రానా దగ్గుబాటి (భల్లాలదేవ) ప్రధాన పాత్రల్లో నటించగా, అనుష్క శెట్టి, తమ్మన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.

Read more Photos on
click me!

Recommended Stories