Karthika Deepam: హిమ తీసుకున్న నిర్ణయానికి సంతోషంలో ప్రేమ్.. నిరుపమ్ కోసం తాపత్రయ పడుతున్న జ్వాల!

Published : May 16, 2022, 07:40 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: హిమ తీసుకున్న నిర్ణయానికి సంతోషంలో ప్రేమ్.. నిరుపమ్ కోసం తాపత్రయ పడుతున్న జ్వాల!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రేమ్ (Prem) హిమ నాకోసమే ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పిందా..  నేను చాలా అదృష్టవంతుడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోగా అక్కడకు సత్య (Sathya) వచ్చి ఏమీ రా ప్రేమ్ హిమ ఇలా చేసింది అని దీనంగా అంటాడు. ఈ క్రమంలో అక్కడకు జ్వాలా ఫుడ్ తీసుకొని వస్తుంది.
 

26

మరోవైపు సౌందర్య (Soundarya) హిమ దగ్గరకు వచ్చి నిశ్చితార్థం ఎందుకు వద్దు అన్నావని అడుగుతుంది. దాంతో సౌందర్య హిమను చెంప మీద గట్టిగా కొడుతుంది. అంతేకాకుండా ఉన్నట్టుండి ఏమైందే నీకు అంటూ.. గట్టిగా విరుచుకుపడుతుంది. ఇక సౌందర్య మొదటిసారి స్వప్న (Swapna) ముందు తల దించుకున్నాను అంటుంది.
 

36

ఇక హిమ (Hima) నానమ్మ సౌర్య.. కూడా నిరూపమ్ బావ ని ప్రేమిస్తుంది అని నీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుంటుంది. అంతే కాకుండా నానమ్మ నీ కాళ్లు పట్టుకుంటాను నన్ను వదిలేయ్ అని అడుగుతుంది. మరో వైపు నిరూపమ్ (Nirupam) ఫుల్ గా మందుకొట్టి కారు లో పడుకుని ఉంటాడు.
 

46

ఈ లోపు అటుగా వెళ్తున్న సౌర్య (Nirupam) నిరూపమ్ ను తన ఆటోలో తీసుకుని వెళుతుండగా నిరూపమ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని చెబుతాడు. దాంతో సౌర్య (Sourya) నాకే ప్రపోజ్ చేశాడు అని మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక సౌర్య నిరూపమ్ ను నేరుగా స్వప్న ఇంటికి తీసుకొస్తుంది.
 

56

అది గమనించిన స్వప్న (Swapna) నువ్వేంట్రా ఆటోలో వస్తున్నావు అంటూ చిరాకు పడుతుంది. అంతే కాకుండా జ్వాల ను పుల్లను తీసేసినట్టుగా మాట్లాడుతుంది. ఇక జ్వాల ఇంటికి వెళుతూ నిరూపమ్ చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇక హిమ (Hima) హాస్టల్ లో ఉంటాను నానమ్మ అని బ్యాగ్ సర్దుకుని బయటకు వస్తుంది.
 

66

ఇక తరువాయి భాగంలో హిమ (Hima) ఒక నష్ట జాతకురాలు..  దాన్ని చేసుకోక పోవడం మంచిదని నిరూపమ్ తో చెబుతుంది. ఆ తర్వాత జ్వాల (Jwala) నిరూపమ్ ను కలిసి మీరు మళ్ళీ ముందు ఎప్పుడు తాగుతారు అని అడుగుతుంది. ఇక మనసులో ఎందుకంటే మీరు మళ్ళీ ఐ లవ్ యు చెబుతారు కాబట్టి అని అనుకుంటుంది.

click me!

Recommended Stories