సమంత దూకుడు.. కాజల్‌, పూజా, రష్మిక, కీర్తిసురేష్‌లకు ఝలక్‌ ఇచ్చిన సామ్‌.. ఇక్కడ ఫస్ట్.. అక్కడ సెకండ్‌

Published : May 15, 2022, 08:25 PM IST

టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్‌ కలిగిన సమంత మరోసారి తన సత్తా చాటింది. ఓ ప్రముఖ ఇండియన్‌ మీడియా సంస్థ ప్రకటించిన రేటింగ్‌లో ఇతర స్టార్‌ హీరోయిన్లని దాటుకుని సమంత టాప్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. 

PREV
16
సమంత దూకుడు.. కాజల్‌, పూజా, రష్మిక, కీర్తిసురేష్‌లకు ఝలక్‌ ఇచ్చిన సామ్‌.. ఇక్కడ ఫస్ట్.. అక్కడ సెకండ్‌

సమంత ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని నిలబడగలనని నిరూపించుకుంది. ఒకప్పుడు స్ట్రగుల్స్ మధ్య ప్రారంభమైన ఆమె జీవితం ఇప్పుడొక వ్యవస్థలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆమె లైఫ్‌ కొత్తగా సినీ రంగంలోకి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లకి, అలాగే అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. అదే ఇప్పుడు సమంతని నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచింది. మిగిలిన కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్లని దాటుకుని సమంత టాప్‌ ప్లేస్‌లో నిలిచేలా చేసింది. మరి ఏ విషయంలో అనేది తెలుసుకుంటే.

26

తాజాగా ఇండియాకి చెందిన ఒక ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ఈ ఏడాది(2022)కి తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్‌ నటీనటుల జాబితాలను విడుదల చేసింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగు హీరోయిన్ల జాబితాలో సమంత నెంబర్‌ 1 పొజిషియన్‌ దక్కించుకుంది. మోస్ట్ పాపులర్‌ టాలీవుడ్‌ హీరోయిన్లలో సమంత మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో కాజల్‌, మూడో స్థానంలో అనుష్క, నాల్గో స్థానంలో పూజా హెగ్డే, ఐదో స్థానంలో రష్మిక మందన్నా, ఆరో స్థానంలో తమన్నా, ఏడో స్థానంలో కీర్తిసురేష్‌, ఎనిమిదో స్థానంలో సాయిపల్లవి, తొమ్మిదో స్థానంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పదో స్థానంలో రాశీఖన్నా నిలిచారు. 

36

మరోవైపు తమిళ హీరోయిన్ల జాబితాలోనూ సమంత టాప్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. అయితే అక్కడ ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యింది. మొదటి స్థానంలో నయనతార నిలిచారు. కోలీవుడ్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలో మూడో స్థానంలో కీర్తిసురేష్‌, నాల్గో స్థానంలో త్రిష, ఐదో స్థానంలో జ్యోతిక, ఆరో స్థానంలో ప్రియాంక మోహన్‌, ఏదో స్థానంలో తమన్నా, ఎనిమిదో స్థానంలో రష్మిక, తొమ్మిదో స్థానంలో అనుష్క, పదో స్థానంలో హన్సిక నిలిచారు. 

46

కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న, భారీ సినిమాల్లో భాగమవుతూ, పాన్‌ ఇండియా హీరోయిన్లుగా రాణిస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నా, రకుల్‌, తమన్నా, కీర్తిసురేష్‌, కాజల్‌ వంటి హీరోయిన్లు ఈ జాబితాలో సమంత కంటే వెనకబడి పోవడం గమనార్హం. దీంతో సమంత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు భాషల్లో తనే టాప్‌లో ఉండటంతో నిజంగా సమంత జర్నీ గొప్పతనం వల్లే అంటున్నారు. ఆమె మండే కొద్ది షైన్‌ అవుతున్నస్టార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

56

సమంత.. ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌ అయ్యారు. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక ఆమె మానసికంగా కుంగిపోయినా, తక్కువ సమయంలోనే కోలుకున్నారు. ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తున్నారు.  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు, వరుసగా సినిమాలు ఒప్పుకోవడంలోనే ఆమె ఎలాంటి దూకుడుతో వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి కసితో ముందుకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో గ్లామర్‌ ఫోటో షూట్ల విషయంలోనూ హద్దులు చెరిపేస్తుంది సమంత. తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది. జీవితంలో స్వేచ్ఛని అనుభవిస్తుందనేందుకు ఇదొక ఉదాహరణ. ఆ స్వేచ్ఛలోనుంచే ఆమె మరింత ధైర్యంగా, మరింత బలంగా ముందడుగు వేస్తుంది. కొత్తగా వచ్చేవారికి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.

66

ప్రస్తుతం సమంత కోలీవుడ్‌, బాలీవుడ్‌, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ తో బిజీగా ఉంది. తెలుగులో ఆమె `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు `యశోద` చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా చేస్తుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో ఓ డిఫరెంట్‌ లవ్ స్టోరీ చేస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్‌ మూవీకి కమిట్ అయ్యింది. మరోవైపు బాలీవుడ్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు టాక్‌. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తూ సమంత ఫుల్‌ బిజీగా ఉండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories