5 కోట్లు బడ్డెట్ పెడితే 60 కోట్లు వసూలు చేసింది, రెండేళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా

Published : Aug 29, 2025, 02:35 PM IST

కేవలం 5 కోట్లతో తెరకెక్కిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 60 కోట్లు వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ రెండేళ్లుగా దుమ్మురేపుతోంది. ఇంతకీ ఆ చిన్న సినిమా ఏంటో తెలుసా? 

PREV
14

ప్రస్తుతం ఓటీటీ వేదికగా పలు భాషల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నా కూడా, ఓటీటీలో సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ప్రతి వారాంతం కొత్తగా విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా మలయాళ భాషలో రూపొందిన చిన్న సినిమా 'సూక్ష్మదర్శిని' (Sookshmadarshini) అంచనాలకు మించి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

24

2023 డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిస్టరీ, థ్రిల్లర్ జానర్స్‌లో రూపొందిన సూక్ష్మదర్శిని ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచి చివరి దాకా ఆసక్తిగా ఉంచగలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అంచనాలకు మించి ఉండటంతో, సినీ ప్రేమికుల మన్ననలు అందుకుంది.

34

నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించిన సూక్ష్మదర్శిని సినిమాకు తెలుగులోయ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగులో ఒక్క సినిమా చేసినా కానీ.. తమిళంలో ఆమె నటించిన 'రాజా రాణి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 'సూక్ష్మదర్శిని'లో ఆమె పాత్ర సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఆమెతో పాటు బాసిల్ నటన కూడా మంచి మార్కులు కొట్టేసింది.

44

తెలుగులో కూడా ఈ చిత్రం డబ్ అయి కొన్ని థియేటర్లలో విడుదలైంది. అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది. థియేటర్ తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ వస్తున్నాయి.ఓ చిన్న సినిమాగా ప్రారంభమైన 'సూక్ష్మదర్శిని', కంటెంట్ మీదే ఆధారపడి పెద్ద విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, గొప్ప కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించడం సినీ పరిశ్రమలో ఆశాజనక పరిణామంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories