క్రమశిక్షణ కలిగిన నటుడు
నటభూషన్, అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు. ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు అయితే, శోభాన్ బాబు మాత్రం ఒక వైపు. ఆయన పద్దతులు, జీవన విధానం, హెల్దీ లైఫ్ స్టైల్, ఆర్ధిక క్రమశిక్షణ, టైమ్ సెన్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే, శోభన్ బాబు జీవితం అంతా చాలా పద్దతిగా, క్రమశిక్షణతో గడిపారు. అంతే కాదు ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు కూడా సంపాదించాడు. తన ఫ్యామిలీలో ఎవరినీ సినిమాల వైపు రాకుండా చూసుకున్నారు శోభన్ బాబు. ఏ విషయంలో అయినా ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు శోభన్ బాబు. ఎవరు చెప్పినా ఆ నిర్ణయంతో మార్పు ఉండదు. నటించకూడదు అని ఒక్క సారి నిర్ణయం తీసుకున్న శోభన్ బాబు, ఆతరువాత ఎవరు వచ్చి అడిగినా అదే మాటకు కట్టుబడి ఉన్నారు. కోట్లు ఇస్తామన్న ఆయన సినిమాలు చేయలేదు.