గ్రాండ్ గా హీరో విశాల్ - ధన్సిక నిశ్చితార్థం, వైరల్ అవుతున్న ఫోటోలు

Published : Aug 29, 2025, 02:21 PM ISTUpdated : Aug 29, 2025, 02:23 PM IST

సౌత్ స్టార్ హీరో  విశాల్ తన 48వ పుట్టినరోజున నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు. 15 ఏళ్ల స్నేహం ప్రేమగా మారి, అది పెళ్లి పీటల వరకూ వెళ్లింది.  

PREV
14

తమిళ స్టార్ హీరో  విశాల్ చెన్నైలో నటీనటుల సంఘ భవనం పూర్తయితేనే పెళ్లి చేసుకుంటానని  చెప్పారు. దాదాపు 9 ఏళ్లుగా ఆ భవన  నిర్మాణం జరిగింది. 95% పనులు పూర్తయ్యాయి. విశాల్ పెళ్లి గురించి చర్చ మొదలైంది. ఏజ్ బార్ అవుతున్న ఆయన పెళ్లిమాత్రం జరగలేదు. కాని చాలామందితో విశాల్ పెళ్లిని ముడిపెడుతూ వార్తలు వైరల్ అయ్యాయి. వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ, లక్ష్మి మీనన్ వంటి వారితో  విశాల్ పెళ్లి అంటూ నెట్టింట సీజన్కొక కథ బయటకు వచ్చింది. 

24

2019లో తెలుగు నటి అనిషా అల్లా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కాని అది రద్దు అయింది. మే నెలలో యోగిడా ట్రైలర్ లాంచ్ లో విశాల్, ధన్షిక పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

34

ఇక ఎట్టకేలకు 48వ పుట్టినరోజున సాయి ధన్షికతో విశాల్ నిశ్చితార్థం జరిగింది. చెన్నై అన్నానగర్ లోని విశాల్ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. 15 ఏళ్ల స్నేహం ప్రేమగా మారింది. ఈ వేడుకకు వారి  తల్లిదండ్రులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

44

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు విశాల్. ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, అందరి ఆశీస్సులు కోరుకుంటున్నానని విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories