Published : Apr 09, 2025, 09:05 PM ISTUpdated : Apr 09, 2025, 09:10 PM IST
Sonu Sood: సోనూ సూద్ తెలుగు ఆడియెన్స్ కి ఒకప్పుడు విలన్‌గా పరిచయం. `అరుంధతి`, `అతడు`, `దూకుడు` వంటి చిత్రాల్లో విలన్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత అడపాదడపా ఆయన తెలుగులో సినిమాలు చేస్తూ కనిపించారు. హిందీలో హీరోగానూ అనేక మూవీస్ చేసి స్టార్‌గా ఎదిగారు. అయితే సినిమాల కంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఎంతో మందిని తమ స్వస్థలాలకు చేర్చడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కోసం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు ఆక్సీజన్ సిలిండర్లు అందించారు.
Sonu Sood: సోనూ సూద్ కరోనా సమయంలో అనేక రకాలుగా తనవంతుగా సహాయం చేసి ఇండియా వైడ్‌గా ఆయన పాపులర్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూలీలను, ఇతర దేశాల్లో ఉన్న వలసదారులను సైతం ట్రావెలింగ్ ఏర్పాటు చేయించి సొంత ఇళ్లకి చేర్పించారు.
అంతేకాదు వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వారికి ఆసుపత్రిలో చికిత్స అందించడంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇవే ఆయన్ని రియల్ లైఫ్ హీరోగా మార్చాయి. కళియుగ కర్ణుడిగానూ అంతా అభివర్ణించారు. అలాంటి సోనూ సూద్‌పై సంచలన ఆరోపణలు చేశారు నా అన్వేషణ అన్వేష్. ఈ మేరకు ఆయన సోనూ సూద్‌పై ఓ సంచలన వీడియో చేశారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ చాలా మంది సెలబ్రిటీలు కోట్లకు కోట్లు సంపాదించారు. హర్ష సాయి ఆ జాబితాలోనే ఉన్నాడు. ఆయనతోపాటు టీవీ సెలబ్రిటీలు చాలా మంది ఈ యాప్‌లను ప్రమోట్ చేశారు.
విష్ణు ప్రియా, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, రీతూ చౌదరీ, యాంకర్ శ్యామల వంటి సెలబ్రిటీలు ఈ యాప్‌లను ప్రమోట్ చేశారు. తీరా తాము చేసిన తప్పులను తెలుసుకుని ఇప్పుడువాటికి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కేసులను ఫేస్ చేస్తున్నారు. వీరితోపాటు ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ పేర్లు బయటకు వచ్చాయి.
35
ఇప్పుడు రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న సోనూ సూద్‌పై సంచలన ఆరోపణలు చేశాడు నా అన్వేషణ అన్వేష్. సోనూ సూద్ కూడా బెట్టింగ్ స్కామ్‌లో భాగమే అని, ఆయన ఎన్నో బెట్టింగ్ యాప్ల్‌లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని తెలిపారు.
ఇటీవల ఆయన `ఫతే` అనే చిత్రంలో నటించారు. తనే దర్శకుడు, నిర్మాత. సినిమాని యాభై కోట్లతో రూపొందిస్తే, కనీసం ఇరవై కోట్లు కూడా రాలేదు. సుమారు ముప్పై కోట్లకుపైగా నష్టాలు వచ్చాయి. ఆ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల సంపాదించాడని ఆరోపంచారు అన్వేష్.
45
naa anveshaana anvesh
ఆయనకు కోట్లకు కోట్లు సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది?, ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారానే అని తెలిపారు. తాను చేసే ప్రతి సాయంలోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషనే ఉంటుందని, కావాలంటే పాత వీడియోలను చెక్ చేయాలని తెలిపారు.
హర్ష సాయి తమ్ముడైతే, సోనూ సూద్ అన్నా అని, ఈ ఇద్దరిదీ ఒకే దారి అని, చేసేవన్నీ ఇలాంటి పత్తి వ్యాపారం పనులే అంటూ బోల్డ్ గా ఆరోపణలు చేశారు అన్వేష్. అంతేకాదు దీనికి సంబంధించిన కేసులను కూడా సోనూ సూద్ ఫేస్ చేస్తున్నాడని తెలిపారు.
55
naa anveshaana anvesh
అయితే దీనిపై సోనూ సూద్ అభిమానులు స్పందించి అన్వేష్ ఆరోపణల్లో నిజం లేదని, తన పాపులారిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని కొందరు వార్నింగ్ ఇస్తుంటే,
చాలా మంది అన్వేష్‌కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. నీకు మేము ఉన్నామని, బెట్టింగ్ యాప్‌ల ద్వారా మోసపోయిన వారికి ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని, ఈ పని ఇలానే కొనసాగించాలని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు నెటిజన్లు.