పాన్ ఇండియా క్రేజ్ కోసం చిత్ర యూనిట్ క్రేజీ ప్లాన్ వేసిందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఆంజనేయస్వామి శ్రీరాముడి భక్తుడు. కాబట్టి శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ ఉంటే పాన్ ఇండియా స్థాయిలో మోత మోగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడి గురించి రాసిన పాటని డైరెక్టర్ వశిష్ట చిత్రీకరించారట. కీరవాణి ఈ పాటకి సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. త్వరలో ఈ సాంగ్ రిలీజ్ కాబోతోంది.