వివాదంలో అట్లీ, అల్లు అర్జున్ సినిమా పోస్టర్.. ఆ సంచలన మూవీతో పోలికలు, నిజమెంతా?

Published : Apr 09, 2025, 07:58 PM ISTUpdated : Apr 09, 2025, 10:05 PM IST

Atlee Allu Arjun AA22 Movie Poster Copy From Dune Movie : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం గురించి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నట్టుగా టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్‌, అట్లీ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ సంస్థలో చర్చలు జరపడం, లుక్‌ కోసం కసరత్తులు చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇది సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

PREV
18
వివాదంలో అట్లీ, అల్లు అర్జున్ సినిమా పోస్టర్.. ఆ సంచలన మూవీతో పోలికలు, నిజమెంతా?
అట్లీ - అల్లు అర్జున్ సినిమా, AA 22

Atlee Allu Arjun AA22 Movie Poster Copy From Dune Movie : ఐకాన్ స్టార్ అని పిలువబడే అల్లు అర్జున్ `పుష్ప 2` చిత్రం తర్వాత తన 22వ చిత్రం AA22లో నటిస్తున్నారు. `పుష్ప 2` చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.1800 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం దర్శకుడు అట్లీ దర్శకత్వంలో AA22 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

28
అల్లు అర్జున్ AA 22 మూవీ

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. సన్ పిక్చర్స్ సంస్థ వీడియో విడుదల చేసి AA22 చిత్రం గురించి అధికారికంగా ప్రకటించింది. ఆడియెన్స్ లో అంచనాలను పెంచేసింది. బన్నీ ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించింది. 

38
అల్లు అర్జున్- అట్లీ

 విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వీడియోలో చాలా మంది VFX దర్శకులు ఉన్నారు. వారితో కలిసి ఈ చిత్రం రూపొందనుంది. సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు ఈ వీడియో చూస్తుంటే క్లారిటీ వస్తుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. అంతేకాదు ఈ వీడియో 6 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తోంది. 

48
డ్యూన్ vs AA22 మూవీ

ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ సంస్థ విడుదల చేసిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌ను చూస్తుంటే టిమోతి చలమెట్, జెండయా నటించిన సైంటిఫిక్ చిత్రం `డ్యూన్` పోస్టర్‌లా ఉందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌ సంచలన మూవీ నుంచి అట్లీ కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

58
AA22 x A6

ఇప్పటికే అట్లీపై కాపీ కొట్టే దర్శకుడు అని చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పోస్టర్ వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. మరోసారి కాపీ క్యాట్‌ అనే వాదన తెరపైకి వచ్చింది. 

68
అట్లీతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం

`డ్యూన్` సినిమా పోస్టర్‌లో ఎడారి, పాత్రలు అన్నీ ఒకేలా ఉన్నాయి. కాపీ పేస్ట్ కంటెంట్ అట్లీకి మొదటిసారి కాదు. గతంలో చాలా సినిమాల్లో అట్లీ కాపీ పేస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ కూడా ఆ ఛాయలోనే కాపీ కొట్టారని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.  అయితే నిజానికి రెండూ భిన్నంగా ఉన్నాయి. కలర్ టోన్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ కొంచెం దగ్గరగా ఉంది. కానీ రెండు సినిమాల పోస్టర్లు సెపరేట్‌గానే ఉన్నాయనేది బన్నీ ఫ్యాన్స్ వాదన. 

78
దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం

ఈ విషయం గురించి 2023లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ, దర్శక, నిర్మాతలకి ఇలాంటి విమర్శలు సాధారణమే అన్నారు. ప్రపంచంలో నేను మాత్రమే ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం లేదు.

88
డ్యూన్ vs AA22, A6

చాలా మంది దర్శకులు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. 30 ఏళ్ల సినిమా జీవితంలో నా కథలా ఎవరూ కథ చెప్పలేదు. నా సినిమాలను ఇతర సినిమాలతో పోల్చి ఎవరైనా అభిప్రాయం పంపితే, నా ప్రయత్నం, నిజాయితీ, శ్రమ అన్నీ కాపీ అని ఎప్పటికీ అనుకోను అని అన్నారు.  

read  more: శంకర్‌ను అట్లీ కాపీ కొడుతున్నారా? అల్లు అర్జున్ మూవీ విషయంలో స్ట్రాటజీ ఇదే..

also read: తాను చేయాల్సిన మూవీ రాజశేఖర్‌కి, తలుచుకుని బాధపడ్డ స్టార్‌ హీరో, కట్‌ చేస్తే అప్పుల్లో నిర్మాత, ఆ సినిమా ఏంటి?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories