బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్, రానా అయితే బెస్ట్.. సోనియా ఆకుల స్టేట్‌మెంట్
Nagarjuna-Sonia Akula: బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. 8వ సీజన్ నాగార్జున హోస్ట్ గానే సాగింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఏడోవ సీజన్‌కి వచ్చిన హైప్ రాలేదు. కంటెస్టెంట్ల పరంగా విమర్శలు వచ్చాయి. అలాగే హోస్ట్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్స్, టాస్క్ ల విషయంలో కొత్తదనం పాటించలేకపోయారని అన్నారు. అలాగే వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున కూడా కొన్ని సార్లు బయాస్‌గా కాకుండా కొందరి పక్షాన వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేసింది.