hit 3, nani
Hit 3 Trailer: నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన `హిట్ 3` ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ట్రైలర్‌లో కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అదే సమయంలో కొన్ని సస్పెన్స్ క్రియేట్ చేసే ఎలిమెంట్లు ఉన్నాయి.
ట్రైలర్ చాలా బోల్డ్ గా, అత్యంత హింసాత్మకంగా ఉంది. ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా నటించారు. ఆయన జనాల మధ్యన ఉంటే అర్జున్‌గా, క్రిమినల్స్ మధ్యన ఉంటే సర్కార్‌గా కనిపిస్తాడట. ఐపీఎస్ అయిన అర్జున్ సర్కార్ జమ్ము కాశ్మీర్‌లో పనిచేశాడు. ట్రాన్ఫర్ మీద తెలుగు స్టేట్స్ కి వస్తాడు.
ఇక్కడ క్రైమ్ రేటు పెరిగిన నేపథ్యంలో డీల్ చేయడానికి అర్జున్ బెస్ట్ ఛాయిస్ అని డిపార్ట్ మెంట్ భావిస్తుంది. రాష్ట్రంలో చిన్న పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే బాధ్యత అర్జున్‌కి అప్పగిస్తుంది పోలీస్ శాఖ.
hit 3 movie, nani
ఒక చిన్నారి కిడ్నాప్ అవుతుంది. అంతటి చిన్న పిల్లని కిడ్నాప్ చేసి ఏం చేస్తారని ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంది. `క్రిమినల్స్ పోలీస్ సెల్‌లో అయినా ఉండాలి, లేదంటే ఆరు ఫీట్ల భూమిలో నైనా ఉండాలని బలంగా కోరుకునే వ్యక్తి అర్జున్. బిహేవియల్ కరెక్షన్ కాని ఏ క్రిమినల్ కూడా సమాజంలో తిరగడానికి లేదని చెబుతాడు.
పాప కిడ్నాప్ అయ్యిందని ఒక మహిళ చెబుతుంది. క్రిమినల్ పోలికలు చెబుతుంది. ఇంతలో ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి యోధుడు ప్రవేశిస్తాడనే శ్లోకాలు వినిపిస్తాయి. ఆ టైమ్‌లోనే నాని ఎంట్రీ ఇస్తాడు. ఒక్క ప్రాణం కాపాడటానికి ఎన్ని రాత్రులు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుస్తుందనే శ్లోకం వినిపిస్తుంది.
hit 3 movie, nani
ఇక వరుసగా నాని అర్జున్ సర్కార్‌గా క్రిమినల్స్ పై విరుచుకుపడుతుంటాడు. మరోవైపు హీరోయిన్ శ్రీనిధి శెట్టితో లవ్ ట్రాక్ చూపిస్తారు. ఆమె నానికి ఎలివేషన్ ఇస్తుంది. ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
మనిషి క్రాస్ చేయలేని లైన్ ఒకటి ఉంటుందని, ఈ రోజు రాత్రి ఆ లైన్‌ని క్రాస్ చేయాలని విలన్లకి వాళ్ల పెద్ద హితభోద చెబుతున్నట్టుగా వాయిస్ వస్తుంది. నిగ్రహంతోనే ధర్మ సంస్థాపన వైపు అడుగువేయగలరనే శ్లోకం వినిపిస్తుంది. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అని హీరోయిన్ అంటే..
ఇక్కడ నువ్వు సర్వైవ్ కాలేవు అని లేడీ విలన్ అంటుంది. దీంతో ఆ లేడీ విలన్‌ని నాని పొడిచి కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్న ఈ మాట అని తన రియల్ లైఫ్‌కి ముడిపెట్టి నాని చెప్పిన తీరు ఆకట్టుకుంది.
hit 3 movie, nani
అనంతరం నాని మరింత హింసాత్మకంగా మారిపోయారు. విలన్లని ఊచకోత కొస్తుంటాడు. తనలోని మరో కోణం చూపించారు. `మార్కో`, `యానిమల్` సినిమాలను తలపించేలా ఆయా సన్నివేశాలున్నాయి. ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. బ్లడ్ బాత్‌ని తలపించేలా ఉంటుంది.
అయితే ఇందులో విలన్ ఎవరు? అనేది మిస్టరీగా ఉంది. `హిట్` మూవీస్‌లో విలన్ ఎవరు అనేది క్లైమాక్స్ లో చూపిస్తారు. కానీ ఇందులో విలన్‌ని ముందే చూపించారా? అనే డౌట్ కనిపిస్తుంది. ప్రారంభంలో విలన్ గురించి చెబుతుండగా నానినే చూపించారు. పైగా ఆయన జైల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
బిక్కు బిక్కుగా ఉన్నాడు. చూడబోతుంటే నానినే ఈ హత్యలకు కారణమా? అనే డౌట్ వచ్చేలా ఆయా సన్నివేశాలు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ చివర్లో ఒక సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది. అదేంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
read more: ఒకే గాయకుడితో పాటలు.. ఫ్లాప్ మూవీని హిట్టు చేసిన ఇళయరాజా.. ఆ సినిమా ఏంటో తెలుసా?
also read: స్టార్ హీరో కొడుకుతో అనుపమా పరమేశ్వరన్ సీక్రెట్‌గా లవ్ ట్రాక్.. త్వరలో పెళ్లి?