Sreeleela Janhvi Kapoor: ఇంద్రుడి కుమార్తెలే శ్రీలీల, జాన్వీ.. యంగ్ హీరో కామెంట్స్.. ఏ ఉద్దేశంతో అన్నాడో?
Sreeleela Janhvi Kapoor: లోకల్, పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ నార్త్, సౌత్‌లోని యూత్‌కి పిచ్చెక్కిస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు శ్రీలీల, జాన్వీకపూర్. పుష్ప-2లో కిసిక్ సాంగ్‌లో నృత్యం చేసి పాన్‌ఇండియా లెవల్‌లో శ్రీలీల క్రేజ్ సంపాదించుకుంది. ఇక అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇద్దరి గ్లామర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే.. వీరి అందాల గురించి ఓ షోలో యంగ్ హీరో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.. శ్రీలీల, జాన్వీ ఇద్దరూ ఇంద్రుడి కుమార్తెలు అని అనేశాడు. ఆ కామెంట్లను చేసిన హీరో ఎవరు, ఎక్కడ, ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.