సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ విడాకులు అంటూ ఓ నెటిజన్ చేసిన ఓ కామెంట్ కు.. ఘాటుగా రిప్లై ఇచ్చింది స్టార్ హీరోయిన్ . విడాకులు విషయంలో ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సోనాక్షీ ఏమన్నారంటే?
సుమారు 7 ఏళ్ల ప్రేమ తర్వాత సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ వివాహం చేసుకున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట పెళ్లికి సోనాక్షి తండ్రికి ఇష్టం లేదని వార్తలు వచ్చినా, ఆయన పెళ్లికి హాజరై వేడుకను వైభవంగా నిర్వహించారు.
7 ఏళ్ల ప్రేమ తరువాత ప్రియుడిని సోనాక్షి పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు విమర్శలు కూడా చేశారు. దీంతో సోనాక్షి, జాహిర్‌లు పెళ్లి ఫోటోలు షేర్ చేసి కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. అది విమర్శలకు దారితీసింది.
సోనాక్షి, జాహిర్‌ల అభిమాని చేసిన ఓ ఇన్‌స్టా రీల్ వైరల్ అయ్యింది. దానికి రకరకాల కామెంట్లు వచ్చాయి. "ప్రియుడు పట్టించుకోకపోతే పెళ్లి చేసుకోవద్దు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "మీ విడాకులు దగ్గర పడ్డాయి" అని మరొకరు రాశారు. దాంతో సోనాక్షీ ఘాటుగా సమాధానం చెప్పారు. ముందు మీ అమ్మానాన్నలకు విడాకులు అవుతాయి.. తర్వాత మా గురించి చూద్దాం అని సోనాక్షి బదులిచ్చారు. ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇప్పుడు జనాలు హ్యాపీ కపుల్స్‌ని చూసి ఈర్ష్య పడుతున్నారు" అందుకే ఇలాంటివి పుట్టిస్తున్నారని సోనాక్షి అన్నారు. " ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న స్టార్స్ లో సోనా, జాహిర్‌లే ఇండస్ట్రీలో హ్యాపీ కపుల్ గా ఉన్నారు. ఈ విషయన్ని చాలామంది నెటిజన్లు తమ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.